Devara :
యన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల అయ్యింది.
‘‘కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు ధైర్యం తప్ప ఏమి తెలియని ఆ కళ్లల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకుంది’’ అంటూ ప్రారంభమైంది రెండు నిమిషాల నలభై సెకండ్ల ‘దేవర’ సినిమా ట్రైలర్.
ప్రేక్షకులకు ఏం చెప్పి, ఏం చూపించి థియేటర్లకి రప్పించాలో అలాంటి కంటెంట్‌ను కరెక్ట్‌గా కట్‌చేశారు దర్శకుడు కొరటాల శివ.
మొత్తానికి తన గత చిత్రం ‘ఆచార్య’తో తడబడ్డ అడుగులను సరిచేసుకునే పనిలో పడ్డట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
ముఖ్యంగా యన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తండ్రి గొప్ప వీరుడైతే కొడుక్కి తన రూపం వచ్చింది కానీ పౌరుషం రాలేదన్నట్లుగా ట్రైలర్‌లో చెప్పారు దర్శకుడు.
చాలా ఎకై్జటింగ్‌గా అనిపించిన ఈ ట్రైలర్‌లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలకపాత్రలో నటించగా జాన్వికపూర్ తారక్ సరసన కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ప్రకాశ్‌రాజ్, హీరో శ్రీకాంత్, పవిత్రాలోకేశ్, అజయ్ తదితరులు నటించారు.
నందమూరి కల్యాణ్‌రామ్‌తో కలిసి సుధాకర్ మిక్కిలినేని నిర్మించిన ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్– సాబుశిరిల్, వీఎఫ్‌ఎక్స్– యుగంధర్ , ఎడిటింగ్– శ్రీకర్‌ప్రసాద్, కెమెరా– రత్నవేలు, సంగీతం– అనిరుద్
Also Read This : బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి సూసైడ్…