Devara Glimps:
టాలీవుడ్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ దేవర.
ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ నిర్మిస్తుండగా రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
అనౌన్స్ మెంట్ నుండి అందరిలో ఎంతో హైప్ ఏర్పరిచిన ఎన్టీఆర్ దేవర మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్స్ తో పాటు అనౌన్స్ మెంట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకోగా తాజాగా మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు.
కాగా రెండు భాగాలుగా రూపొందుతున్న దేవర పార్ట్ 1 యొక్క ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై ఎన్నో అంచనాలు ఏర్పరిచాయి.
ముఖ్యంగా గ్లింప్స్ కి అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు రత్నవేలు గ్రాండియర్ విజువల్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ డైలాగ్స్, పవర్ఫుల్ మాస్ యాక్షన్ వంటివి ఎంతో బాగున్నాయి.
ఇక మొత్తంగా ఈ గ్లింప్స్ ప్రస్తుతం యూట్యూబ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది అనే చెప్పాలి.
అయితే గ్లింప్స్ లో విజువల్ ఎఫెక్ట్స్ కూడా అలరించడంతో దేవర టీమ్ ఈ విషయంలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల మూవీ నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, దర్శకడు కొరటాల శివ దేవర మూవీ కోసం ఎంతో కష్టపడుతున్నారని అన్నారు.
అలానే ఆయనతో పాటు మేము అందరం కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మెల్లగా ఎంతో జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కిస్తున్నాం.
పక్కాగా ఏప్రిల్ 5న విడుదల తరువాత దేవర మూవీ మంచి సక్సెస్ సొంతం చేసుకుంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసారు.
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ ఆలీ ఖాన్ నెగటివ్ రోల్ చేస్తున్న ఈ మూవీలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు.
ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ గా విశేషమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్, ఈ మూవీతో తప్పకుండా
మరొక బ్లాక్ బస్టర్ కొట్టి కెరీర్ పరంగా బిగ్గెస్ట్ సక్సెస్ అందుకోవడం ఖాయం అని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఏప్రిల్ 5న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానున్న దేవర ఏస్థాయిలో విజయం అందుకుంటుందో చూడాలి.
Also Read : ఆడ్వాణీ ఎన్నాళ్లకు గుర్తొచ్చాడు మోదీ..?