సూపర్ ఓవర్లో ఢిల్లీ ఘన విజయం.

ఐపీఎల్ 2025 సీజన్ 18 లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన 32 వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ , రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో 188 పరుగులు చేసింది. అభిషేక్ పోరల్ 37 బంతుల్లో 49 పరుగులు ( ఐదు ఫోర్లు ఒక సిక్సర్) కేఎల్ రాహుల్ 32బంతుల్లో 38 పరుగులు (రెండు ఫోర్స్ రెండు సిక్సర్లు) చేయగా స్టబ్స్ 18 బంతుల్లో 34 పరుగులు (2 ఫోర్లు 2 సిక్సర్లతో) అక్షర్ పటేల్ 14 బంతుల్లో 34 పరుగులు( 4 ఫోర్లు 2 సిక్సర్లు) చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 188 కి చేరింది. తర్వాత బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు ఓపెనర్స్ యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ లు తొలి వికెట్ కు 76 పరుగులు జోడించారు. సంజు శాంసన్ 19 బంతుల్లో 31 పరుగులు చేసి ( 2 ఫోర్స్ 3 సిక్సర్లు) రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. జైస్వాల్ 37 బంతుల్లో 51 పరుగులు ( 3 ఫోర్లు 4 సిక్సర్లు) చేశాడు. నితీష్ రాణా 28 బంతుల్లో 51 పరుగులు ( 6 ఫోర్లు 2 సిక్సర్లు) చేయడంతో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ సొంతం అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ చివరి ఓవర్లో అవసరమైన 9 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవటంలో విఫలమైన ఆర్ ఆర్ 8 పరుగులు నమోదు చేయడంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ జట్టులో ఓపెనర్లుగా హెట్మెయర్, రియాన్ పరాగ్ నిర్ణీత ఓవర్ను ప్రారంభించారు. స్టార్క్ బౌలింగ్ చేశాడు. తొలి బంతి డాట్ బాల్ కాగా రెండో బంతిని బౌండరీకి తరలించాడు. మూడో బంతికి సింగల్ రావటంతో నాలుగో బంతిని రియాన్ బౌండరీ బాదాడు. ఆ బంతి నోబ్ అవ్వటంతో ఫ్రీ హిట్ అయ్యింది. తర్వాత బాల్ వైడ్ అవ్వటంతో లేని పరుగు కోసం ప్రయత్నించి రాన్ అవుట్ అయ్యాడు రియాన్ పరాగ్. ఐదో బంతికి హెట్మెయర్ షాట్ కొట్టగా రెండో రన్ కోసం ప్రయత్నించగా రన్ అవుట్ అయ్యాడు. ఇద్దరు రన్ అవుట్ అవ్వడంతో 11 పరుగులకు రాజస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆరు బంతుల్లో 12 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్లుగా స్టబ్స్ , కేఎల్ రాహుల్ లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. సందీప్ శర్మ బౌలింగ్ చేశాడు. తొలి బంతికి 2 పరుగులు రెండో బంతికి బౌండరీ మూడో బంతికి 1 పరుగు వచ్చింది. నాలుగో బంతికి స్టబ్స్ సిక్స్ కొట్టి ఢిల్లీ క్యాపిటల్స్ టీంని విజయ తీరానికి చేర్చాడు. ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం సాధించింది.
శివ మల్లాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *