500 కోట్ల ఆస్తి.. 2 కోట్ల ఖర్చు.. ఆ సినీ బినామీ రాజకీయ ఎత్తు‘గడలు‘?
Cinema To Politics:
ఆయన గత ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయి అధికారి. ఓ క్లిష్ట సమయంలో మీడియా అంతా ఆయనే. వాస్తవానికి బీఆర్ఎస్ సర్కారులో సీఎం కేసీఆరే
అన్నీ. మంత్రులకూ నోరు తెరిచి మాట్లాడే స్వేచ్ఛ ఉండేది కాదు. కానీ, ఈ అధికారి అత్యంత కీలక శాఖను చూసేవారు కావడంతో మీడియా
ముందుకు వచ్చి మాట్లాడేవారు. అంతేగాక రాజకీయ నాయకుడి స్థాయిలో వ్యాఖ్యలు చేసేవారు. స్టేట్ మెంట్లు ఇచ్చేవారు. గత ప్రభుత్వాధినేతను
గొప్పగా పొగిడేవారు. ఆయనకు అత్యంత విధేయతతో వ్యవహరించేవారు. పనిలో పనిగా ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధం చేసుకున్నారు. తను పుట్టిన
ప్రాంతంలోని నియోజకవర్గాన్ని ఎంచుకుని పలు కార్యక్రమాలు చేపట్టారు.
అంతా తూచ్..
ఓ పార్టీ టికెట్ ఆశించి ఎంతో హుషారుగా ఆ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టారు. ఎక్కడికక్కడ హోర్డింగులు, సేవా కార్యక్రమాలతో ప్రచారం
అంతా కొత్తకొత్తగా ఉండేలా చూసుకున్నారు. ఇంకేం..? టికెట్ తనకే ఆశతో ఉన్నారు. కానీ, చివరకు అంతా తిరగబడింది. అక్కడి సిటింగ్ కే టికెట్
రావడంతో రాష్ట్రస్థాయి అధికారి ఆశలకు గండిపడింది. అయితే, సేవా, ప్రచార కార్యక్రమాలకు రూ.2 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు చెబుతారు.
ఆడబ్బంతా పోయినట్లేనని భావించిన ఆయన ఏం చేసేది లేక కొన్నాళ్లపాటు తెరమరుగుయ్యారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల ముంగిట
అకస్మాత్తుగా శిబిరం మార్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో ఓ పార్టీ అసెంబ్లీ టికెట్ కోసం విశ్వప్రయత్నం చేసిన ఆయన ఇప్పుడు అధికార
పార్టీ నుంచి రెండు పార్లమెంటు సీట్లకు దరఖాస్తు సమర్పించడం గమనార్హం.
సర్కారు ఉరిమితే అంతే..
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆ అధికారికి సంకట పరిస్థితి ఎదురవుతోంది. అందులోనూ సర్కారు.. అవినీతి ఆరోపణలను ముందుపెట్టి
అక్రమార్జనను వెలికితీయడం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతోనే ఆ అధికారి అధికార పార్టీకి జై కొడుతున్నట్లు
స్పష్టమవుతోంది. కాగా, ఇదే అధికారి తన సామాజిక వర్గం కార్యక్రమాల్లోనూ ఇటీవల చురుగ్గా వ్యవహరిస్తున్నారు. తన కులానికి అధిక ప్రాధాన్యం
ఇస్తానని చెబుతున్నారు. మరోవైపు తన సొంత ప్రాంతంలోని నియోజకవర్గంలో ఎన్నికల్లొ పోటీ కోసం రూ.2 కోట్ల వరకు ప్రచారానికి ఖర్చుపెట్టారని
సమాచారం.
ఈయన సినీ బినామీనా?
రాష్ట్రస్థాయి అధికారి అయిన ఆయన సినిమా పరిశ్రమలోని పెద్ద తలకాయ ఒకరికి బినామీ అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అధికారి సొంత ఆస్తినే
రూ.500 కోట్ల వరకు ఉంటుందని చెబుతారు. ఆ ధీమాతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు పేర్కొంటుంటారు. మామూలుగా అయితే డబ్బులు బయటకు
తీయరని ఈ అధికారిపై విమర్శలు ఉన్నాయి. కానీ, రాజకీయాల్లో మాత్రం ఖర్చుకు వెనుకాముందు చూడడం లేదని చెబుతున్నారు.
Also Read:Padma Awards:పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల పురస్కారం.