68 ఏళ్ల వయసులో జిమ్ లో చిరంజీవి కఠిన వర్కవుట్స్
Chiranjeevi Viswambhara:మెగాస్టార్ చిరంజీవి నుంచి కొత్త సినిమా వస్తుందంటే అటు ఫ్యాన్స్ లో, ఇటు ప్రేక్షకుల్లో ఎలాంటి
అంచనాలుంటాయో చెప్పాల్సిన అవసరంలేదు.
అందుకు తగ్గట్లుగానే చిరంజీవి కూడా సినిమాల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటారు.
అయినప్పటికీ ఒక్కోసారి ఫెయిల్యూర్స్ కూడా ఆయనను పలకరిస్తూనే ఉన్నాయి. గత ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ గా సూపర్
హిట్ కొట్గిన మెగాస్టార్.. ఇటీవల ‘భోళా శంకర్’ విషయంలో మాత్రం చేదు ఫలితాన్ని ఎదుర్కోవాల్సివచ్చింది.
దీంతో ఈసారి మరింత జాగ్రత్తగా ఓ యువ దర్శకుడి దర్శకత్వంలో సోషియో ఫాంటసీ చిత్రాన్ని ఎంచుకున్నారు.
అంతేకాదు.. అందుకోసం అవసరమైనట్లుగా తనను తాను మలచుకుంటున్నారు. ‘విశ్వంభర’ పేరుతో తెరకెక్కుతున్న
ఈ చిత్రం కోసం చిరంజీవి కండలు పెంచుతూ, జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను షేర్ చేసి.. విశ్వంభర కోసం
సిద్ధమవుతున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో 68 ఏళ్ల వయసులో
చిరంజీవి చేస్తున్న వర్కవుట్స్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంత వయసులోనూ మెగాస్టార్ స్టామినా ఏమాత్రం తగ్గలేదు అంటూ
కామెంట్స్ చేస్తున్నారు.
చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల
‘విశ్వంభర’ సినిమా విషయానికి వస్తే.. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ మూవీకి బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు
సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కుతుండగా యువీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ.200 కోట్లతో బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు
చేస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. చిరంజీవి 156 చిత్రంగా వస్తున్న విశ్వంభరతో ‘బియాండ్ యూనివర్స్’
అంటూ కొత్త కథను చెప్పబోతున్నారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్
మారేడుమిల్లి అడవుల్లో జరుగుతుందని సమాచారం. చిరంజీవి లేని షూటింగ్ పార్ట్ ని పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది.
షూటింగ్ లో త్వరలోనే చిరంజీవి పాల్గొననున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ అని టాక్ నడుస్తొంది.
త్రిష ఫిమేల్ లీడ్ రోల్ చేస్తున్నట్లు, రానా దగ్గుబాటి విలన్ గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read:IPS Kothakota Srinivasa Reddy:ఎంతోమంది వస్తారు.. కానీ ఈయన?