మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.
నేడు చిరంజీవి ఇంట్లో అంజనమ్మ పుట్టినరోజు వేడుకలను రామ్ చరణ్, ఉపాసన కలిసి నిర్వహించారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను చిరు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ తల్లి అంజనాదేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
” అమ్మ.. ఈ ప్రత్యేకమైన రోజున.. మీరు మాటల్లో చెప్పలేనంతగా ప్రేమించబడ్డారని,
మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా గౌరవించబడ్డారని మీరు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము.
హ్యాపీ బర్త్ డే అమ్మ. మా కుటుంబానికి హృదయం. మా నిస్వార్థమైన ప్రేమకు మూలం.
ప్రేమ కృతజ్ఞలతో నీ పాదాలకి నమస్కరిస్తూ పుణ్యం చేసుకొన్న నీ సంతతి” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
రామ్ చరణ్ ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. నాన్నమ్మకు ఇంటి బయట నుంచే పూలతో ఘన స్వాగతం పలికి ఆమెతో కేక్ కట్ చేయించాడు.
ఆ డెకరేషన్ అంతా ఉపాసననే చేసిందని చెప్పుకొచ్చాడు. అంజనమ్మ కుమార్తెలు, కొడుకు చిరంజీవి దగ్గరుండి కేక్ కట్ చేయించారు.
అనంతరం తమ ఇంట్లో ఉన్న స్టాఫ్ తో కలిసి ఫోటోలు దిగారు. ఇక ఈ బర్త్ డే వేడుకలు చూసి అంజనమ్మ చాలా సంతోషం వ్యక్తం చేశారు.
“చాలా బావుంది నాన్న.. మీ అందరు ఉంటే నాకు ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది” అని ఎమోషనల్ అయ్యారు.
అయితే ఈ వేడుకలో మెగా బ్రదర్ నాగబాబు,మూడవ కుమారుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మిస్ అయ్యారు.ప్రస్తుతం వారిద్దరూ ఏపీలో ఉంటున్న విషయం విదితమే.
ఇక వీడియో చూసిన వారందరూ రామ్ చరణ్ లుక్ గురించే మాట్లాడుకుంటున్నారు. గేమ్ ఛేంజర్ తరువాత RC16 సినిమాలో నటిస్తున్నాడు.
బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. రంగస్థలం తరువాత ఆ రేంజ్ లో చరణ్ మేకోవర్ కనిపిస్తుంది.
గుబురు గడ్డం, జుట్టు, చెవికి రింగు. ఇప్పటికీ చరణ్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక అంజనా దేవి.. ప్రస్తుతం కొడుకు చిరంజీవి ఇంట్లోనే ఉంటున్నారు.
ప్రస్తుతం ఆమె తన కోడలు సురేఖతో, మనవరాలు ఉపాసనతో కలిసి అత్తమాస్ కిచెన్ అనే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు.
అందులో అంజనమ్మ పాతకాలం పద్దతిలో వంటకాల రెసిపీస్ ను తయారుచేయిస్తున్నారు. ఇక అంజనమ్మ అంటే రామ్ చరణ్ కు ప్రాణం.
ఆమెను ఏడిపించకుండా నిద్రపోను అని అన్ స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చాడు.
అందుకే నాన్నమ్మ పుట్టినరోజును రామ్ చరణ్ ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. ఈ వీడియో చూసిన అభిమానులు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సంజు పిల్లలమర్రి
Also Read This : యన్టీఆర్, మహేశ్‌బాబు రవివర్మను ఎందుకు ఆట పట్టించారు?
