తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్తగా హీరో అవ్వాలంటే ఆ హీరో తమ్ముడో, ఈ హీరో అల్లుడో, మరో హీరో బామ్మర్ది అయితేనే అవకాశాలోస్తాయి అని ఒక భారీ స్టేట్‌మెంట్‌ను పాస్ చేశాడు ‘చౌర్యపాఠం’ హీరో ఇంద్ర. చిన్నప్పుటి నుండి ఉన్న కసితో హీరో అయ్యాను. సినిమాకి కావాల్సిన అన్ని రకాల కళలు నేర్చుకున్నాను. అన్ని విద్యల్లో అంతా కరెక్ట్‌గా ఉన్నాను అనుకున్న తర్వాతనే హీరోగా ఎంట్రీ ఇచ్చాను. చిన్నప్పటి నుండి చిరంజీవి గారంటే ఉన్న పిచ్చితో నా పేరును ఇంద్రగా మార్చుకున్నాను. నా పేరుకి ఓ కథ ఉంది అంటూ తన సినిమా గురించి, తన గురించి బోలెడన్ని కబుర్లను ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు ఇంద్ర. సినిమా ఇండస్ట్రీలో అవమానాలు ఎలా ఉంటాయో కళ్లకు కట్టినట్లు చెప్పుకొచ్చారు ఇంద్ర. ఇంద్ర స్టోరీ ఏంటో మీరు ఓ లుక్కేయండి…పాడ్‌కాస్ట్ విత్ శివమల్లాల
Also Read This : జాన్వి బైక్ రైడ్.. ఏ సినిమా కోసం?
