హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు అయింది. బెల్లంకొండ శ్రీనివాస్.. జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టుల కాలనీలో నివాసం ఉంటున్నాడు. అయితే తాజాగా ఆయన తన ఇంటికి వెళ్తున్న సమయంలో రాంగ్ రూట్‌లో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఆయనను ట్రాఫిక్ పోలీస్ అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన శ్రీనివాస్.. ట్రాఫిక్ పోలీసుతో ఆయన దురుసుగా ప్రవర్తించారు. దీంతో తాజాగా ఆయనపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.