స్టార్స్ అందరితో పని చేసే అవకాశాన్నిచ్చిన ఒకే ఒక్క సక్సెస్..

సక్సెస్‌ మన కళ్లముందే ఉన్నట్లుంటుంది. సక్సెస్‌ను అందుకున్నవాళ్లకు మాత్రమే తెలుస్తుంది ఆ సక్సెస్‌ కోసం వాళ్లు ఎదురు చూసిన రోజుల గురించి వారు పడ్డ కష్టం గురించి. బాబిడియోల్‌ బాలీవుడ్‌ టాప్‌ హీరో ధర్మేంద్ర చిన్న కొడుకు, సన్నీ డియోల్‌ తమ్ముడు. తాను హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వం వహించిన ‘బర్సాత్‌’తోనే తనలోని నటుడు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత తాను ఎనిమిదేళ్లపాటు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. 2007 తర్వాత తాను ఒప్పుకుని చేసిన సినిమాలేవి బాక్సాఫీస్‌ వద్ద నిలవలేక విలవిలలాడిపోయాయి. కట్‌ చేస్తే అక్కడనుండి బాబికి హిట్‌ అనే రెండక్షరాలను వినటానికి సక్సెస్‌ అనే విజయాన్ని అందుకోవటానికి దాదాపు 15 ఏళ్ల నిరీక్షణ అవసరమైంది. బాగా ఆకలితో ఉన్న పులికి పంచభక్ష పరమాన్నం లాంటి ఆహారం ‘యానిమల్‌’ సినిమా ఇచ్చింది. ఆ విజయంతో అప్పటివరకు బాబిడియోల్‌ను చూసి పక్కకు తప్పుకున్న జనాలు ఎదురొచ్చి స్వాగతం పలకటం బాబికి కొత్త ఉత్సాహాన్నిచ్చింది.

 

కట్‌ చేస్తే సౌత్‌ స్టార్స్‌తో పనిచేసే అవకాశం దొరికింది. ఊహించని రెమ్యునరేషన్స్‌ సొంతం చేసుకుని సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఒక్క శుక్రవారం తనదైతే ఎంత బిజిగా ఉండచ్చో ఈ బాలీవుడ్‌ నటుడే ఉదాహరణ. ‘యానిమల్‌’ తర్వాత బాబికి సూర్యతో, ‘హౌస్‌ఫుల్‌–5’లో, బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మాహరాజ్‌’, పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన ప్రిస్టేజియస్‌ ప్రాజెక్ట్‌ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో అలియాభట్‌ మెయిన్‌లీడ్‌లో నటస్తున్న ఉమెన్‌ సెంట్రిక్‌ సినిమా ‘ఆల్ఫా’తో పాటు విజయ్‌ హీరోగా నటిస్తోన్న ‘జననాయగన్‌’ సినిమాలతో ఫుల్‌ బిజిగా ఉన్నారు బాబిడియోల్‌. అప్పటివరకు అందని ద్రాక్షలా ఊరించిన సక్సెస్‌ 15 ఏళ్ల తర్వాత బాబికి 2023లో ఓ తెలుగు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా వల్ల దక్కడంతో విజయాన్ని ఇది నా సెకండ్‌ ఇన్నింగ్స్‌ అంటూ ఎన్నోసార్లు ఎమోషనల్‌గా ఫీలయ్యారు. జూలై 3న బాబిడియోల్‌ ఔరంగజేబ్‌గా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ట్రైలర్‌ విడుదల అవ్వనుంది. ‘యానిమల్‌’ సినిమా తర్వాత బాబిడియోల్‌ పాత్ర పరిధిని మరింతగా మెరుగులు దిద్దారట దర్శకుడు జ్యోతికృష్ణ. ఈ సినిమాలోని బాబిడియోల్‌ ఆహార్యం చూసినవారికి మరోసారి బాబి మ్యాజిక్‌ చేయటానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఈ సినిమా విడుదల తర్వాత బాబి క్రేజ్‌ మరింత పరిగే అవకాశం ఉంటుందని సినిమా విశ్లేషకుల అంచనా…ఆల్‌ ది వెరీ బెస్ట్‌ బాబిడియోల్‌…

శివమల్లాల

 

Also Read This :హరి హర వీరమల్లు’ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ చెప్పిన జ్యోతికృష్ణ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *