ఇవాళ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు నేడు (శుక్రవారం) ఓటీటీలో సందడి చేస్తున్నాయి. విక్కీ కౌశల్, రష్మికా మందన్నా జంటగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘చావా’ సినిమా నేడు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అలాగే హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ‘కోర్ట్’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, వైభవ్, నీహారిక జంటగా నటించిన ‘పెరుసు’ చిత్రాలు నేడు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యాయి. ఆది సాయికుమార్, అవికా గోర్ నటించిన షణ్ముఖ చిత్రం, శర్వానంద్, కృతిశెట్టి జంటగా నటించిన ‘మనమే’ చిత్రం నేడు ఆహాలో విడుదలైంది. సౌబిన్ షాహర్, బసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు డబ్ మూవీ ‘ప్రావింకూడు షాపు’ నేడు సోనీ లివ్‌లో విడుదలైంది. ప్రజ్వల్ దేవరాజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘రాక్షస’ సన్ నెక్ట్స్‌లో వచ్చేసింది. నుస్రత్ భరూచ, సోహా అలీఖాన్ నటించిన ‘ఛోరీ 2’ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.