Bharat Ratna to LK : మంత్రివర్గంలోకి తీసుకోలేదు.. రాష్ట్రపతిగా రెండుసార్లు చాన్సునప్పటికీ ఇవ్వలేదు..
పార్టీ కీలక కమిటీ నుంచి కూడా తప్పించారు.. అసలు ఆయన చేతిలో పురుడు పోసుకున్న రామ మందిర
ఉద్యమం ఫలవంతమై రాముడికి గుడి సాకారమైనప్పటికీ ఆయనకు పిలుపే లేదు.. పదేళ్లలో ఎందరికో భారత రత్న
అవార్డు ఇచ్చారు. కానీ, ఆయన మాత్రం గుర్తుకు రాలేదు. ఇప్పుడు మాత్రం ప్రేమ ఉట్టిపడింది. ఆయనకు భారత రత్న
ఇవ్వాలన్న సంగతి గుర్తొచ్చింది.
2002 గుజరాత్ అల్లర్ల ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ పదవి నుంచి దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు సహా అనేక మంతి నాయకులు మోదీని తప్పుబట్టారు.
కానీ, ఒక్కడే ఒక్కడు మోదీని కాపాడాడు. ఆయనే లాల్ క్రిష్ణ అడ్వాణీ. అయితే, ఆ తర్వాత నుంచే అడ్వాణీకి బ్యాడ్ టైం మొదలైంది.
రెండేళ్ల తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో ఆయన ప్రధాని కావాలన్ని కాంక్ష నెరవేరలేదు.
2009లోనూ ఓటమితో అడ్వాణీ రాజకీయం జీవితం దాదాపు ముగిసింది. మధ్యలో 2005లో జిన్నాను పొగిడి
మరింత చేటు తెచ్చుకున్నారు.Bharat Ratna to LK
2014లో మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి అడ్వాణీ ఎన్నికల్లో గెలిచారు.
ఆయన ప్రియ శిష్యుడు మోదీ ప్రధాని అయ్యారు. కానీ, అడ్వాణీని కేబినెట్ లోకి తీసుకోలేదు.
2017లో రామ్ నాథ్ కోవింద్ ను, 2022లో ముర్మును రాష్ట్రపతిని చేసిన సందర్భంలోనూ అడ్వాణీ గుర్తుకురాలేదు.
ఇక ఇటీవల అయోధ్య రామ మందిర ప్రరారంభానికీ అడ్వాణీకి సరైన ఆహ్వానం అందలేదు.
అయోధ్య ఆలయ ప్రారంభానికి అయోధ్య రామమందిర ట్రస్టు నుంచి ఆహ్వానం అందితేనే అధికారికం.
కానీ, అడ్వాణీని ట్రస్టు పిలవలేదు. కేవలం వీహెచ్ పీ తరఫునే ఆహ్వానం వెళ్లింది.
అడ్వాణీ పాల్గొంటారని వీహెచ్ పీనే చెప్పింది. తీరా చూస్తే మందిర ప్రారంభ సమయంలో ఆయన లేరు.
చల్లటి వాతావరణం, వయో భారం కారణంగానే అడ్వాణీ హాజరుకాలేదనే సమాధానం వచ్చింది.
ఇంతలా అడ్వాణీని అవమానించిన మోదీ సర్కారు.. ఇటీవల భారత రత్న అవార్డు ప్రకటన సమయంలోనూ విస్మరించింది.
బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న ఇవ్వడాన్ని ఎవరూ తప్పుపట్టరు కానీ.. హిందూత్వ ప్రతినిధి..
రామమందిర ఉద్యమ సారథి అన్నిటికీ మించి బీజేపీకి ఓ దశలో అన్నీ తానే అయిన అడ్వాణీని జీవిత
చరమాంకంలో విస్మరించడమే ఆశ్చర్యపరిచింది. 97 ఏళ్ల వయసులో తప్పదన్నట్లుగా.. సామాజిక సమీకరణాలను
బేరీజు వేసుకుంటూ.. అది కూడా సంప్రదాయానికి భిన్నంగా గణతంత్ర దినోత్సవం ముగిశాక భారత రత్న
అవార్డును ప్రకటించడం గమనార్హం.