రివ్యూ– భైరవం

విడుదల తేది– 30–05–2025
నటీనటులు– జయపుధ, మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆనంది, దివ్య పిళ్లై, అథితి శంకర్, సంపత్‌ రాజ్, రాజారవీంధ్ర, వెన్నెల కిశోర్, అజయ్‌
ఎడిటర్‌– ఛోటా కె.ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ– హరి
సంగీతం– శ్రీచరణ్‌ పాకాల
నిర్మాత– కె.కె.రాధామోహన్‌
దర్శకత్వం– విజయ్‌ కనకమేడల

కథ–
సినిమా ప్రారంభంలోనే సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ సంపత్‌రాజ్‌ వచ్చి రిజైన్‌ చేస్తాను అంటూ తన పై ఆఫీసర్‌కి చెప్తాడు. చిన్న పిల్లల ఆటల ఉందా? నీకు అంటూ రాజీనామా వద్దు ఏం వద్దు అంటూనే ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు అసలు కథ చెప్పటం ప్రారంభిస్తాడు. ఒక ఊరిలో ఉండే ఇద్దరు స్నేహితులు గజపతి (మంచుమనోజ్‌), వరదా (నారా రోహిత్‌) చిన్నప్పటినుండే ప్రాణ స్నేహితులు. అనుకోకుండా వారికి అనాథ (శ్రీను) తారాసపడతాడు. చిన్నప్పటినుండి ఒకే ప్రాణంలా కలిసున్న వారి జీవితాల్లోకి అనుకోకుండా వచ్చిన అనర్థం ఏమిటి? ఒకరికోసం ఒకరు అన్నట్లు బ్రతికిన వారందరూ చివరికి ఏమయ్యారు? అనే కథను తెరపైనే చూడాలి.

నటీనటుల పనితీరు–
ముగ్గురు హీరోల కథ కావటంతో ప్రతి ఒక్కరికి ఎంతో ఇంపార్టెన్స్‌ ఉంటుంది. ముఖ్యంగా శీను పాత్ర చాలా సైలెంట్‌గా ఉంటూనే అవసరమైన చోట వైలెంట్‌గా మారాలి. ఆ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌ పాయింట్‌ వచ్చేసరికి శ్రీనులోని ఎమోషన్స్‌ పండించిన తీరు బావుంది. అలాగే నారా రోహిత్‌ చేసిన వరదా పాత్ర ఎంతో డిగ్నిఫైడ్‌గా ఉండటంతో ఆ పాత్రకు న్యాయం చేశాడు రోహిత్‌. మంచు మనోజ్‌ స్క్రీన్‌పై కనిపించి చాలాకాలం కావటంతో మంచి ఆకలి మీదున్నట్లుగా తన పాత్రలో జీవించేశాడు. ఇలా ముగ్గురు హీరోలతో పాటు చుట్టూ ఉన్న పాత్రలుకూడా కథలో కీరోల్స్‌ ప్లే చేయటంతో ఎవరివైపు తీసుకోలేడు ప్రేక్షకుడు. జయసుధ, అజయ్, సంపత్‌ వారి పాత్రల్లో బాగానే నటించారు.

టెక్నికల్‌ విభాగం–
భైరవం సినిమాలో ఫైట్స్‌కి పెద్ద పీఠవేశారు. అందరూ కమర్షియల్‌ మాస్‌ హీరోలు అవ్వటంతో ఎవరితగ్గ ఎలివేషన్‌లు వారికి ఉండటంతో ఫైట్స్‌మాత్రం నెక్ట్స్‌లెవెల్‌లో అనిపించాయి. ముఖ్యంగా ఇంట్రెవల్‌ సీక్వెన్స్‌ చాలాబావుంది. శ్రీచరణ్‌ పాకాల సంగీతం ఓకే. ఎడిటింగ్‌ పర్‌ఫెక్ట్‌గా కుదిరింది. కాస్టూమ్స్‌ అందరికి చక్కగా కుదిరాయి. ఇంతపెద్ద క్రూతో పనిచేసిన దర్శకునికి మంచి మార్కులే పడతాయి అనటంలో ఎటువంటి సందేహం అవసరంలేదు. ముఖ్యంగా ముగ్గురు హీరోలతో పనిచేసేటప్పుడు వారందరిని ఈక్వల్‌గా ట్రీట్‌ చేయటమంటే నిర్మాతకు, దర్శకునికి పెద్ద ఛాలెంజే. ఆ విషయంలో నిర్మాత, దర్శకులిద్దరూ విజయం సాధించినట్లే లెక్క.

ప్లస్‌ పాయింట్స్‌–
ముగ్గురు హీరోలు
ఇంట్రెవెల్‌ బ్యాంగ్‌
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ డైలాగ్‌ డిక్షన్‌

మైనస్‌ పాయింట్స్‌–
ఫస్ట్‌హాఫ్‌ స్లోగా ఉండటం
కథ ముందుగానే తెలిసిపోవటం
వెన్నెల కిశోర్‌ అవసరంలేని కామెడి

ఫైనల్‌ వర్డిక్ట్‌– థియేటర్‌లో చూసే సినిమా..

రేటింగ్‌– 2.5/5
శివమల్లాల

 

Also Read This :పవన్‌కళ్యాణ్‌ గారికి రాసిన పాటతో పద్నాలుగేళ్ల యుద్ధాన్ని జయించాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *