...

Bhagavanth Kesari Review : భగవంత్ కేసరి రివ్యూ.!

Bhagavanth Kesari Review

సినిమా – భగవంత్ కేసరి
నటీనటులు – నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కిచ్లు, శ్రీ లీల, అర్జున్ రామ్ పాల్, ఆర్ శరత్ కుమార్ తదితరులు.
సంగీతం – ఎస్ ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ – రామ్ ప్రసాద్
ఎడిటర్ – తమ్మిరాజు
నిర్మాత – సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్ – షైన్ స్క్రిన్
దర్శకత్వం – అనిల్ రావిపూడి
విడుదల – 19 అక్టోబర్ 2023

కథ విషయానికి వస్తే –

ఇలాంటి ఎమోషనల్ టచ్ ఉన్న సినిమాకు, సినిమా కథ ఇక్కడే తెలుసుకుంటే సినిమా చూస్తున్నప్పుడు ఆ హై ఫిల్ రాదు,

కానీ తండ్రి కూతుర్లకు సంబందించిన ఎమోషనల్ కథ అని మాత్రం చెప్పుకోవచ్చు. ప్రతి తండ్రి మనసులో తన కూతురు ఎలా ఉండాలి

అనుకుంటాడో చెప్పే కథ ఇది, థియేటర్ లో ఫ్యామిలీ తో సహా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా.

ఈ సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే , స్టార్టింగ్ ఒక మంచి ఎపిసోడ్ తోనే స్టార్ట్ అవుతుంది. బాలయ్య మనకు బాగా నచ్చేస్తాడు.

కాని కాజల్అగర్వాల్ పాత్ర సైకాలిజిస్ట్ గా కొంచెం ఇబ్బంది పెట్టింది, ఫస్ట్ హాఫ్ లో బాలయ్య బాబు కి శ్రీలీల కు మధ్య నడిచే ఎమోషనల్ ఎపిసోడ్

ఆకట్టుకుంటుంది, అదే ఇంకొంచెం ఉన్నా ఫస్ట్ హాఫ్ ఇంకా బెటర్ గా ఉండేది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఒక సర్ప్రైసింగ్ ఎపిసోడ్ కూడా చాలా కీలకంఅయింది అని చెప్పాలి,

దానిని కూడా రావిపూడి ఇంకా కొంచెం బాగా చేసి ఉంటే సినిమా వేరే లెవెల్ లో ఖచ్చితంగా ఉండేది. ఫస్ట్ హాఫ్ హీరో కి

సినిమా మొదటి భాగం మాత్రం “మనం అనుకున్నంత ఉండదు”. అక్కడక్కడా బోర్ ఫీల్ అవ్వక తప్పదు. !

సెకండ్ హాఫ్ లో హై ఎలిమెంట్స్, ఫ్యాన్స్ కి కావాల్సిన ఎలివేషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి.

లాస్ట్ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఇరగ కొట్టేసాడు అని చెప్పొచ్చు, క్లైమాక్స్ వచ్చే నోట్ “బేటికో షేర్ బనావ్” అనే కాన్సెప్ట్ మాత్రం మనకు ఈ సినిమా మీద రెస్పెక్ట్ ని కొంచెం పెంచుతుంది.

సెకండ్ హాఫ్ లో వచ్చే   శ్రీ లీల ఫైట్ అయితే “సినిమా హాల్లోనే చూసి ఎంజాయ్ చేయాలి.

నటి నటుల పనితీరు :

ముందుగా మాట్లాడుకోవాల్సింది బాలయ్య లుక్, ఈ విషయంలో అనిల్ రావిపూడి ని, బాలయ్య కాస్ట్యూమ్ డిజైనర్ ని అలానే బాలయ్య పర్సనల్ మేకప్ మ్యాన్ ని మెచ్చుకొని తీరాలి.

మనం ఒక సరికొత్త బాలయ్య ను చూస్తాం ఈ సినిమాలో. ఎందుకంటే బాలయ్య మీద వాళ్ళు తీసుకున్న శ్రద్ద స్పష్టంగా కనపడుతుంది.

బాలయ్య సింపుల్ గా సూపర్, బాలయ్య డైలాగ్ డెలివరి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు,

ఈ సినిమాలో డైలాగ్స్ ఉన్నంతలో బాలయ్య వేరే లెవెల్ లో చెప్పాడు, బాలయ్య లుక్ ఈ సినిమాకు మెయిన్ అట్రాక్షణ్. అనిల్ రావిపూడి అనవసరపు కామెడి లు లేకుండా తీసారు. బాలయ్య వయసుకి తగ్గ సినిమా ఇది.

ఆ తరువాత కాజల్ అగర్వాల్ నటన కు స్కోప్ ఉన్న పాత్ర కానప్పటికీ ఎదో పర్వాలేదు అని చెప్పుకోవాలి. పెళ్లి తరువాత కాజల్ కొంచెం లుక్

మారినప్పటికీ, ఈ సినిమా వరకు ఈ పాత్రకు తన ప్రజెంట్ లుక్ సెట్ అయింది అని చెప్పుకోవాలి. కథ మొత్తం బాలయ్య అండ్ శ్రీలీల మీదనే తిరుగుతుండటం వలన కాజల్ కి అంత స్క్రిన్ ప్రజెన్స్ ఉందని అనిపించలేదు.

నటి నటుల పనితీరు :

ఒక సీన్లో తప్ప శ్రీ లీల సినిమా మొత్తాన్ని తన నటన తో లాగేసే ప్రయత్నం అయితే చేసింది అని చెప్పుకోవాలి, తన స్క్రిన్ ప్రెజెన్స్ చాలా బాగుంది.

శ్రీలీల ఈ సినిమాతో ఇంకో మెట్టు ఎక్కేసింది. కానీ ఒక సీన్ లో అయితే శ్రీలీల ఇచ్చిన ఎక్సెప్రెషన్ కి గూగుల్ లో కూడా డెఫనెషన్ దొరకదు. అలాంటివి మర్చిపోతే మిగతా అంతా ఒకే.

విలన్ గా అర్జున్ రామ్ పాల్ బాగా సెట్ అయ్యాడు, బాలయ్య హీరోయిజం ధీటుగా తన విలనిజాన్ని చూపించాడు, తనే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకొని, తన డిక్షన్ ని కూడా మనకు పరిచయం చేసాడు.

తను బాలీవుడ్ లో మంచి నటుడు కూడా, తన నటన ని అనిల్ పూర్తి స్థాయిలో వాడుకోవడంలో ఫెయిల్ అయ్యాడు అని చెప్పొచ్చు.

ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, నిర్మాతలు కథ ను నమ్మి ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా పెట్టేసారు అనిపిస్తుంది. లొకేషన్స్ అన్నీ బాగున్నాయి.

ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా చాలా బాగుంది. కాస్టింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా వర్క్ చేసింది, ప్రతి పర్టికులర్ రోల్ కి మనం స్క్రిన్ మీద చూసే ఆర్టిస్ట్ బాగా సెట్ అయ్యాడు.

టెక్నీకల్ :

టెక్నీకల్ టీం వర్క్ ఎలా ఉందంటే ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు ట్రిమ్ చేసి ఉంటే బాగుండు అని పిచ్చింది, కెమెరా వర్క్ చాలా బాగుంది. డి ఐ కూడా చాలా బాగుంది, సౌండ్ డిజైన్ బాగుంది.

థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా చోట్ల ప్రాణం పోసింది. థమన్ తప్ప మరెవరు బాలయ్య కు మ్యూజిక్ తో ఆ రేంజ్ ఎలివేషన్స్ ఇవ్వలేడు అనిపిచ్చింది సినిమా చూస్తున్నంతసేపు.

సాంగ్స్ అంత రిజిస్టర్ కాలేదు. కాని థమన్ అందించిన బ్యాకగ్రౌండ్ స్కోరు మాత్రం పిక్స్ అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో “యలమలయా” అనే బీట్ మాత్రం చాలా కాలం మనం హాఁ చేసేలా ఉంది.

ఫస్ట్ హాఫ్ ఓకె ఓకె అనిపిచ్చినప్పటికీ, సెకండ్ హాఫ్ మాత్రం మనల్ని ఎమోషనల్ గా లాక్ చేసింది, కొన్ని సీన్లు కంట తడి కూడా పెట్టిస్తాయి.

యూత్ ని అంతగా ఆకట్టుకోకపోయినా ఫ్యామిలీ ప్రేక్షకులకు, ఫాదర్ అండ్ డాటర్ కి మాత్రం నచ్చే అంశాలు ఉన్నాయి.

ప్రస్తుత కాలంలో చిన్న వయస్సు అమ్మాయిలకు, ఆడపిల్లలకు అవసరమైన ఒకటి రెండు ఎలిమెంట్స్ ని కూడా యాడ్ చేసి వాళ్ళ దగ్గర మంచి మార్కులు వేయించుకోగలింది టీం.

ఒక్కమాట లో –  ఈసారికి కే  “సరి”   

రేటింగ్ –   2.5/5 (Above Average Film) 

Also Read This : మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఎమోషనల్ మాటలు

Producer AhiTeja Exclusive Interview
Producer AhiTeja Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.