స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి వెండితెరపై కనిపించక చాలా కాలమవుతోంది. ఆమె సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె నటించిన ‘ఘాటి’ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈ తరుణంలో వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి మేకర్స్ షాక్ ఇచ్చారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా మేకర్స్ ప్రకటించారు. సినిమా ఒక జీవనది లాంటిదని.. ప్రవహిస్తూనే ఉంటుందని తెలిపారు. ‘ఘాటి’ కేవలం సినిమా మాత్రమే కాదని.. అదో ప్రతి ధ్వని అని.. ఒక అడవి గాలి.. మట్టి నుంచి పుట్టిన కథ అని తెలిపారు. ప్రతి ఫ్రేమ్‌ను మీకు అద్భుతంగా అందించాలనే ఉద్దేశంతో ఉన్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే సినిమా మరింత ఆలస్యమవుతోందని తెలిపారు. ఈ నిరీక్షణను వృథా కానివ్వబోమని.. ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన అనుభూతిని అందిస్తుందని నమ్ముతున్నట్టు మేకర్స్ తెలిపారు. 2023 తర్వాత అనుష్క చేస్తున్న చిత్రమిది. క్రిష్ జాగర్లమూడి, అనుష్క కాంబోలో రూపొందిన రెండో చిత్రమిది. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.