హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. రామ్ దేశినా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఒకవైపు సినిమా కంప్లీట్ చేస్తూనే అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను సైతం శరవేగంగా నిర్వహించారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో విధి హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
ప్రజావాణి చీదిరాల