‘డేంజర్ బాయ్స్’ వచ్చేస్తున్నారు..

కన్నడలో అనూహ్య విజయం సాధించిన చిత్రం ‘అపాయవాడి హెచ్చరిక’. బాక్సాఫీస్‌పై వసూళ్ల వర్షం కురిపించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘డేంజర్ బాయ్స్’ పేరుతో విడుదల చేయనున్నారు. ప్రముఖ దర్శకనిర్మాత శ్రీరంగం సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రి-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ‘డేంజర్ బాయ్స్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా… టీజర్‌ను ప్రముఖ దర్శకనిర్మాత డాక్టర్ లయన్ సాయివెంకట్, పాటలను ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ సత్యవర్ధన్ విడుదల చేశారు. ట్రైలర్ ను తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్ ఆవిష్కరించారు.

ఈ వేడుక కోసం బెంగళూర్ నుంచి మొత్తం చిత్రబృందం హైదరాబాద్ రావడం విశేషం. ‘దండుపాళ్యం, కేజిఎఫ్ కాంతారా’ చిత్రాల కోవలో… కన్నడలో అనూహ్య విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ సంచలనం సృష్టించడం ఖాయమని అతిధులు పేర్కొన్నారు. ఈ ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే… ఈ చిత్రం మరో “మంజమల్ బాయ్స్” అవుతుందనిపిస్తోందని వారు తెలిపారు. యశశ్విని క్రియేషన్స్ – గీతా ఫిలిమ్స్ పతాకలపై శ్రీరంగం సతీష్ కుమార్ సమర్పణలో… వి.జి.మంజునాథ్ – పూర్ణిమ ఎమ్.గౌడ్ ఈ సినిమాను నిర్మించగా.. అభిజిత్ తీర్ధహళ్లి దర్శకత్వం వహించారు. వికాస్ ఉత్తయ్య, రాధా భగవతి, అశ్విన్ హసన్, రాఘవ్ కొడబాద్రి, మిథున్ తీర్ధహళ్లి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నామని, దాన్ని ఏకకాలంలో కన్నడ – తెలుగులో తెరకెక్కిస్తామని ఈ సందర్భంగా ఈ వేదికపై ప్రకటించారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *