AP Deputy CM :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమైన రాజకీయ మార్పు జరిగింది. తెలుగుదేశం పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడు తిరిగి ఆంధ్రప్రదేశ్ యొక్క మూడవ ముఖ్యమంత్రిగా,
విభజన అనంతరం రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
2024 ఎన్నికలలో కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
గతంలో జగన్ మోహన్ రెడ్డి తన పదవీకాలంలో ఐదుగురిని డిప్యూటీ ముఖ్యమంత్రులుగా నియమించడం అత్యంత చారిత్రాత్మక విషయం.
ఈ తరహా డిప్యూటీ సీఎం నియామకం గత దశాబ్దంలో వివిధ రాష్ట్రాలలో ప్రాముఖ్యత పొందింది.
డిప్యూటీ ముఖ్యమంత్రి రాజ్యాంగ బద్ధత
భారత రాజ్యాంగంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని స్పష్టంగా ప్రస్తావించలేదు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 163(1) ప్రకారం, గవర్నర్ తన విధుల నిర్వహణలో తనకి సహాయంగా ఉంటూ, ఏమైనా ముఖ్యమైన సలహాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి
తన పనులలో బిజీ గా ఉంటారు కాబట్టి ఆయనకి బదులుగా అయన నేతృత్వంలో ఒక మంత్రి మండలి ఉండాలని పేర్కొంది.
ముఖ్యమంత్రిని గవర్నర్ నియమించి, ఆయన సలహా ప్రకారం ఇతర మంత్రులను కూడా నియమిస్తారు. ఇక్కడి వరుకు రాజ్యంగం లో ఉంది కానీ,
డిప్యూటీ సీఎం పదవి గురించి ఒక్క చోట కూడా ప్రస్తావించలేదు. అసలు డిప్యూటీ సీఎం అనే పదమే రాజ్యాంగంలో పొందుపరిచి లేదు.
డిప్యూటీ ముఖ్యమంత్రి పాత్ర మరియు అధికారాలు
రాజ్యాంగబద్ధమైన ప్రస్తావన లేకపోయినా, డిప్యూటీ ముఖ్యమంత్రులకు మంత్రివర్గంలో వివిధ శాఖలు కేటాయిస్తారు.
ఇది వారికి కేబినెట్ మంత్రులతో సమానంగా ప్రోటోకాల్ ఇంకా భద్రతా ప్రయోజనాలను ఇస్తుంది.
కేబినెట్ మంత్రుల్లాగా ఈ డిప్యూటీ ముఖ్యమంత్రులు కూడా జీతం మరియు అలవెన్సులు పొందుతారు, కానీ అదనంగా మరే ఇతర సౌకర్యాలు ఉండవు.
ముఖ్యమంత్రి తను కావాలి అనుకుంటే ప్రత్యేకంగా సెక్యూరిటీ కూడా కేటాయించవచ్చు.
అయితే, డిప్యూటీ ముఖ్యమంత్రి పాత్ర ప్రధానంగా గౌరవనీయమైనదిగా ఉంటుంది కాని ప్రత్యక్ష పరిపాలనా అధికారాలు ఉండవు.
రాజకీయ సమీకరణాల ప్రకారం ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంను నియమించి, అవసరమైతే తొలగించవచ్చు కూడా.
పరిపాలనా అధికారాలు మరియు హక్కులు
డిప్యూటీ సీఎం పదవి కేబినెట్ మంత్రులతో సమానంగా, కేబినెట్‌లో రెండవ అత్యున్నత పదవిగా ఉంటుంది. డిప్యూటీ సీఎం తనకు మంత్రిగా అప్పగించిన శాఖల తాలుకా ఫైళ్లను, కార్యకలాపాలను మాత్రమే చూస్తారు,
కానీ ముఖ్యమంత్రి అందుబాటులో లేని సమయంలో ఆయనని సంప్రదించకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు,
ఒక వేళ ముఖ్యమంత్రే ఫలానా నిర్ణయం తీసుకోమని చెప్పినా డిప్యూటీ సీఎంకు ఎలాంటి సైన్ పవర్ ఉండదు కనీసం ఆ సంతకానికి విలువ కూడా ఉండదు. సంతకం చెల్లుబాటు కూడా కాదు.
అధికారిక కార్యక్రమాలలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నప్పుడు ఆయనకు బదులుగా అయన స్థానంలో డిప్యూటీ సీఎం కేబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహించవచ్చు.
సారాంశం
మొత్తానికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగబద్ధమైనది కాకపోయినా, ఇది ఒక ముఖ్యమైన రాజకీయ నియామకం, ఇది తెలుగుదేశం, జనసేన రాజకీయ మైత్రిని బలపరచడానికి అలాగే ముఖ్యమంత్రికి అదనపు మద్దతు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ కు ఈ పదవి ఆలంకారంగా ఉంటుంది.
Also Read This : తెలంగాణాలో మళ్లీ టిడిపి పార్టీ వచ్చే అవకాశముందా?