ప్రస్తుతం ఇండస్ట్రీలో అనుపమ పరమేశ్వరన్ హవా నడుస్తోంది. ‘టిల్లు స్క్వేర్’, ‘డ్రాగన్’ చిత్రాలు మంచి సక్సెస్ సాధించడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ రెండితలైంది. అయితే ఈ బ్యూటీ గురించి రూమర్స్ కూడా అదే స్థాయిలో వినవస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఓ క్రికెటర్‌తో లవ్‌లో ఉందన్నారు. ఇప్పుడు ధ్రువ్ విక్రమ్‌తో డేటింగ్ అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతుందో తెలియదు కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను కెమెరా ముందు నిల్చుంటే పది పేజీల డైలాగ్స్ అయినా అలవోకగా చెప్పేస్తానని తెలిపింది.
తనకు అసలు ఎలాంటి భయమూ అనిపించదని కానీ ఒక్క విషయంలో మాత్రం ఒత్తిడికి గురవుతుంటానని వెల్లడించింది. అది మరెదో కాదు.. ఫోటో షూట్స్ సమయంలో.. ఫోటో షూట్ చేయించుకునేటప్పుడు ఒత్తిడికి గురవుతూ ఉంటుందట. అలాగే ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో కెమెరా ముందు కూర్చుంటే చాలు చాలా ఇబ్బంది పడిపోతుందట. కానీ ప్రస్తుతం కథల విషయంలో తన ధోరణి మారందని తెలిపింది. అందుకే ‘టిల్లు స్క్వేర్’, ‘డ్రాగన్’ చిత్రాల్లో తన కేరెక్టర్‌ని అంతా ఇష్టపడ్డారని తెలిపింది. వాస్తవానికి టిల్లు స్క్వేర్‌కు ముందు మనం చూసిన అనుపమ వేరు.. అంతకు ముందు అనుపమ వేరు. ‘టిల్లు స్క్వేర్’లో గ్లామర్ విషయంలో కాస్త హద్దులు దాటేసింది. ఇక ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో అనుపమ బిజీబిజీగా గడిపేస్తోంది.