Anupama Parameswaran:
మలయాళ క్యూట్ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఈ దీపావళి పండుగ నాడు అచ్చం తెలుగింటి అమ్మాయిలా ముస్తాబయి దీపాల వెలుగులో వెలిగిపోయింది. ఆ పిక్స్ ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకొని అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసింది.
ఇక సినిమాల విషయానికి వస్తే అనుపమ ప్రస్తుతం డీజే టిల్లు స్క్వేర్ లో నటిస్తుంది. తన కెరియర్ లో ఫస్ట్ టైం గ్లామర్ డోసు ఎక్కువ పెంచి మరీ ఈ సినిమాలో నటిస్తుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్టు అందుకున్న డీజే టిల్లు సినిమాకి ఇది సీక్వెల్.
Also Read: Famous Telugu Producers : చాపకిందనీరులా తమిళంలోకి తెలుగు నిర్మాతలు…
‘బాహుబలి’ సినిమా తర్వాత ఇండియన్ సినిమా స్వరూపమే మారిపోయింది.
రీసెంట్‌గా భాషతో సంబంధం లేకుండా మంచి సినిమా ఏ భాషలో ఉంటే ఆ భాషలో సినిమాను చూసేస్తున్నారు సినిమా లవర్స్అందరూ.
అందుకే పెద్ద పెద్ద బ్యానర్స్ కూడా అనేక భాషల్లో సినిమాలు తీయటానికి ముందుకు వస్తున్నాయి.
గతంలో అయితే తమిళ నిర్మాతలు ఈ విషయంలో ముందు వరుసలో ఉండి తమిళ, తెలుగు భాషల్లో సినిమాలు నిర్మించేవారు.
ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు నిర్మాతలు చాపకిందనీరులా అన్ని భాషల్లో సినిమాలు తీయటానికి సమాయత్తం అవుతున్నారు.
‘దిల్’ రాజు…
తెలుగులో ప్రముఖ నిర్మాతగా పేరుగాంచిన నిర్మాత ‘దిల్’ రాజు రెండేళ్ల క్రితమే తమిళంలోను భారీ ఎంట్రీ ఇచ్చారు.
2022 సంక్రాంతి సినిమాల్లో విజయ్ హీరోగా నటించిన ‘వారిసు’ తెలుగులో ‘వారసుడు’తో వచ్చి భారీ హిట్‌ను అందుకున్నారు నిర్మాత ‘దిల్’ రాజు.
ఆ తర్వాత కూడా తమిళ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ‘గేమ్‌చేంజర్’ చేస్తున్న సంగతి తెలిసిందే.
తెలుగు తమిళం అనే తేడా లేకుండా మంచి కథ దొరికితే ఏ భాషలో అయినా సినిమా తీసేందుకు రెడీ అని ‘దిల్’ రాజు అనేక సందర్భాల్లో మాట్లాడిన సంగతి తెలిసిందే.
భారీనా చిన్న సినిమానా అనే తేడా లేకుండా మంచి కథ దొరికిన ప్రతిసారి తన క్రియేటివ్ ఇంటెలెక్చువల్ బ్రెయిన్‌తో భాషతో సంబంధం లేకుండా హిట్‌వైపు మాత్రమే చూస్తున్నాడు రాజు.
తమిళంలో ఎంతోమందితో మంచి సంబంధాలున్న రాజు ‘గేమ్‌చేంజర్’ సినిమా విడుదల తర్వాత తన గేమ్‌ను ఏ హీరో వైపుకు ఎటువైపుకు గురి పెడతాడో చూడాలి.