యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి ఎందుకోగానీ పెద్దగా చేయదు. ఆమె ఫ్యాన్స్‌కి చాలా దూరంగా ఉంటుంది. తాజాగా మాత్రం ఫ్యాన్స్‌తో ఏర్పాటు చేసిన ఓ మీట్‌లో పాల్గొని చాలా ఆసక్తికర విషయాలు చెప్పింది. ఒకప్పుడు అందరి మాదిరిగానే తాను కూడా ఒకింత ఇబ్బంది పడ్డానని.. ప్రస్తుతం తన లైఫ్ చాలా అందంగా ఉందని అనసూయ తెలిపింది. తనకు కావల్సిన వస్తువులన్నీ కొంటున్నానని.. ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వెళుతున్నానని పేర్కొంది. ఈ క్రమంలోనే తన కుటుంబ విషయాలను సైతం అనసూయ వెల్లడించింది.
కుటుంబ సభ్యులే తన తండ్రిని మోసం చేశారని దాని వల్ల తాను ఎంతో ఇబ్బంది పడ్డానని తెలిపింది. ఆ తరువాతే తనకంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నారట. ఈ క్రమంలోనే హైదరాబాద్ రేస్ క్లబ్‌లో శిక్షకుడిగా పని చేశారని అనసూయ తెలిపింది. ఆ సమయంలో తన తండ్రి వద్ద 12 గుర్రాలుండేవని.. ఇక రేస్ క్లబ్‌లో పని చేసే సమయంలో తన తండ్రి రేస్‌లు ఆడటం వలన తాము చాలా అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొన్నామని వెల్లడించింది. జీవితంలో స్థిరత్వం గురించి తన తండ్రి అర్థం చేసుకోలేకపోయారని తెలిపింది.
వినోదా భావే సమయంలో భూదానోద్యమ సమయంలో తమ కుటుంబం 500 ఎకరాలకు పైగా దానం చెసిందని అనసూయ వెల్లడించింది. ఇక తన తండ్రి చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పని చేశారన్నారు. సోషల్ యాక్టివిటీస్‌లోనూ తన తండ్రి సుదర్శన్ పేరు ప్రముఖంగా వినిపించేదని వెల్లడించింది. తాము ముగ్గురం అక్కాచెల్లెళ్లం కావడంతో అబ్బాయి పుట్టడం లేదన్న బాధ తన తండ్రిలో ఉండేదని.. కనీసం ఒక్క వారసుడైనా ఉండాలని కోరుకునేవారన్నారు. తన తండ్రి సుదర్శన్ రావు 2021లో క్యాన్సర్ కారణంగా మరణించారని అనసూయ వెల్లడించింది.