Ananya Nagalla :
తెలంగాణాలోని ఖమ్మం జిల్లానుండి పెద్ద చదువులకోసం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన కుటుంబం వారిది. అక్కడినుండి చదువు పూర్తవ్వటం సాఫ్ట్‌వేర్ జాబ్ రావటం అన్నీ చకచకా జరిగిపోయాయి.
జాబ్ చేసుకుంటూ సరదాగా స్నేహితులతో కలిసి షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న ఆ అమ్మాయి 2019లో దేశం మెచ్చిన నేతన్న కథ ‘మల్లేశం’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌కి పద్మగా పరిచయం అయ్యింది.
ఈ ముద్దుగుమ్మ పద్మ భలేవుందే అంటూ బ్లెస్ చేశారు సినిమా చూసిన ప్రేక్షకులంతా. ఆ రోజు మొదలైన అమ్మడి ప్రయాణం ఎక్కడా ఆగలేదు.
కరోనాలో ‘ప్లేబ్యాక్’ కరోనా తర్వాత పవర్‌స్టార్ హీరోగా నటించిన ‘వకీల్‌సాబ్’ లో కీలకపాత్ర…ఇలా తనకొచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఈ తెలుగమ్మాయి పేరు అనూష…స్క్రీన్ నేమ్ అనన్య నాగళ్లగా మార్చుకుంది.
ట్యాగ్‌తెలుగుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఆమె తన మనోగతాన్ని ఆవిష్కరించింది. ఆడపిల్లగా తాను ఎదుర్కొంటున్న సవాళ్లు సోషల్ మీడియా విసుర్లు ఆమెకు ఎన్నో పాఠాలు నేర్పాయని అంటున్నారు నాగళ్ల.
ఈ ఏడాది ముఖేశ్ ప్రజాపతి దర్శకత్వంలో తాను నటించిన ‘బహిష్కరణ’ వెబ్‌సిరీస్ జీ5 చానల్‌లో జూలై 19నుండి అంటే రేపటినుండి స్ట్రీమింగ్ జరుగుతుంది.
ఓ డిఫరెంట్ రోల్‌లో ‘శ్రీకాకుళం షెర్‌లాక్ హోమ్స్’లోను ‘పొట్టేల్’ సినిమాలో కూడా చాలా మంచి పాత్రలు చేశాను.
ఈ సినిమాలు రెండు ఆగస్ట్‌లో విడుదలకు సిద్ధమవుతున్నాయి అని చెప్పారు అనన్య.
నెగిటివిటీ, ట్రోల్స్ తట్టుకోలేని రోజు విపరీతంగా ఏడుస్తాను అని మొదట్లో అయితే చాలా ఎక్కువ రోజులు బాధపడేదానినని
ఇప్పుడు ఎంత పెద్ద సమస్య అయినాకూడా ఆ సమయాన్ని గంటల్లోకి తీసుకొచ్చి వీలైనంత ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా అన్నారు.
ఎన్నో ప్రశ్నలకు క్యూట్‌గా తనదైన స్టైల్లో సమాధానం చెప్పిన అనన్య ఇంటర్వూను ఓ సారి చూసేయండి. 1000 ప్రశ్నల సమాధానం ఈ ఇంటర్వూ. ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : ఎలాంటి పాత్రకైనా ఫుల్ న్యాయం చేస్తా : శ్రీతేజ్