‘బేబి’ అంటూ అప్పుడెప్పుడో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలు సందడి చేశారు. తిరిగి ఇంత కాలానికి ఆఫ్‌స్క్రీన్‌లో జంటగా కనిపించి సందడి చేశారు. హైదరాబాద్‌లోని కొంపల్లిలో సెవెన్ ఓక్స్ అనే మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఆనంద్, వైష్ణవి చేతుల మీదుగా జరిగింది. ఇప్పటి వరకూ పెంపుడు జంతువుల కోసం ఒక అన్ని ఫెసిలిటీస్‌తో కూడిన హాస్పిటల్ తెలంగాణలో ఎక్కడా లేదు. అన్ని సౌకర్యాలతో ఈ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్ మధుర శ్రీధర్ రెడ్డి, సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ ఛైర్మన్ డా.శ్రీ రెడ్డి, సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ ఎండీ సంధ్య బి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘మనకు ఏదైనా సమస్య ఉంటే చెప్పుకుంటాం కానీ పెట్స్ వాటి బాధను, అనారోగ్య సమస్యను చెప్పుకోలేవు. రెండేళ్ల క్రితం మా ఇంట్లో పెట్‌కు హెల్త్ బాగో లేకుంటే అమ్మా, నాన్న చాలా బాధపడ్డారు. అప్పడు డా.శ్రీ రెడ్డి గారు సెవెన్ ఓక్స్ డాక్టర్స్ చికిత్స అందించారు. మా ఇంట్లో పెట్స్‌ను చాలా కేరింగ్ గా చూసుకుంటాం. అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి. విదేశాలకు వెళ్లినా, అవి ఎలా ఉన్నాయో ఎప్పుడు కనుక్కుంటాం. నాన్నకు పెట్స్ చాలా ఇష్టం’’ అన్నారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ‘‘నేను పెట్ లవర్‌ను. మా ఇంట్లో ఆల్ఫా అనే డాగ్ ఉంది. అది మా ఇంటికి వచ్చాక ఇంట్లో పిల్లాడిలా మారిపోయింది. దాన్ని ఎలా బాగా చూసుకోవాలి అనేది ఎప్పుడూ మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆలోచిస్తుంటాం’’ అన్నారు.