...

ఆమని కెరీర్‌లో గుర్తుంచుకునే సినిమా ‘నారి’..

ఈ సినిమా చూసిన తర్వాత మనం రాసే రివ్యూ వల్ల ఏ ఒక్క ఆడపిల్లకైనా మంచి జరుగుతందేమో అని చిన్న ఆశ. ఎప్పుడోగాని కంటెంట్‌ ఉన్న ఇలాంటి సినిమాలు రావు. అలా ఆలోచించి సినిమా విడుదలకు ఒకరోజు ముందే రివ్యూను విడుదల చేస్తుంది ట్యాగ్‌తెలుగు.కామ్‌…ఈ సినిమా ఫస్ట్‌హాఫ్‌ ఒక అమ్మాయి కథ, సెకండ్‌ హాఫ్‌ ఒక అమ్మకథ.. అమ్మ , అమ్మాయిలు లేని ఇల్లుండదు. వారికి జరిగే అన్యాయాలకు ఎన్ని కోర్టులున్నా న్యాయం జరగదు. భారతీలాంటి వారు ఈ సమాజంలో ఎంతోకొంత మార్పు తీసుకొస్తారని ఆశిస్తూ….రివ్యూలోకి పదండి…

రివ్యూ– నారి

విడుదల తేది– 07–03–2025
నటీనటులు– ఆమని, వికాశ్‌ వశిష్టా, మౌనికా రెడ్డి, ప్రగతి, నిత్యశ్రీ, సునయన, నాగమహేశ్, రామచంద్ర , ‘ఛత్రపతి’ శేఖర్, కేదార్‌ శంకర్‌ …..
ఎడిటర్‌– మదన్‌ కుమార్‌ గుల్లపల్లి
సినిమాటోగ్రఫీ– వి.రవికుమార్, భీం సాంబ
సంగీతం– వినోద్‌కుమార్‌ విన్నూ
నిర్మాత– శశి.వంటిపల్లి
దర్శకత్వం– సూర్య వంటిపల్లి

కథ–
తొలిసీన్‌లో ఒకమ్మాయిని బలవంతం చేసి విచక్షణా రహితంగా కారులో నుండి తోసేస్తారు 20 ఏళ్లుండే కుర్రాళ్లు ముగ్గురు…ఆ అమ్మాయి అపస్మారక స్థితిలో ఉండటంతో గమనించిన అటువైపుగా వెళుతున్న ఆటోడ్రైవర్‌ సత్తెన్న ఆసుపత్రిలో చేర్పిస్తారు. ఆ న్యూస్‌ వైరల్‌గా మారటంతో లోకల్‌ యం.ఎల్‌.ఏ ఆ యువతికి సాయం చేస్తానని నాగమహేశ్‌ లాయర్‌ ప్రగతి వద్దకు వస్తాడు. ఎంతో సహృదయంతో యువతికి ఆసరా ఇవ్వటానికి వచ్చిన నాగమహేశ్‌ని లాయర్‌ ప్రగతి అభినందిస్తుంది. ఆ కేసును నేను విచారణచేసి ఆ అమ్మాయిపై అమానుషంగా ప్రవర్తించిన వారికి శిక్షపడేలా చేస్తాను అనటంతో నాగమహేశ్‌ అలా చేస్తే ఆ అమ్మాయి గురించి అందరికి తెలుస్తుంది కానీ, ఆ అమ్మాయికి ఏం ఉపయోగం ఉందదు అని మొండిగా వాదిస్తాడు. అప్పుడు లాయర్‌ ప్రగతి నాగమహేశ్‌ ఎందుకొచ్చాడో పసిగట్టటంతో వారద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. నాగమహేశ్‌ ప్రగతిపై గన్‌ ఎక్కుపెడతాడు. అక్కడే ఉన్న ప్రగతి స్టాఫ్‌ సునయన, రామచంద్ర ఎప్పుడూ కూల్‌గా ఉండి కేసులను డీల్‌ చేసే ప్రగతి ఎందుకు ఇంతలా రియాక్ట్‌ అయ్యారో అర్థంకాదు. అప్పుడు తన అసిస్టెంట్స్‌ను ఉద్ధేశించి మీకు ఇటువంటి కేసుకు సంబంధించిన కథ ఒకటి చెప్తాను అని లాయర్‌ ప్రగతి, భారతి (ఆమని) కథను చెప్పటం ప్రారంభిస్తుంది. అసలు భారతి ఎవరు? లాయర్‌ ప్రగతి ఎందుకు భారతి కథను ఉదాహరణగా చెప్పింది? ఆడవాళ్లకు జరిగే అన్యాయాలను గురించి భారతీ ఏంచేసింది? అనే కథ తెలియాలంటే ‘నారి’ సినిమాను థియేటర్‌లో చూడాల్సిందే….

నటీనటుల పనితీరు–
నటి ఆమని తన సహజనటనతో ప్రేక్షకులకు దగ్గరైన సంగతి తెలిసిందే. ‘మిస్టర్‌ పెళ్లాం’, ‘ఆ నలుగురు’ చిత్రాల తరహాలోనే ‘నారి’ సినిమా కథనుకూడా ఆమని నడిపిన తీరు నిజంగా ఎంతో గొప్పగా మరింత హృద్యంగా ఉంటుంది. కొన్ని సీన్లలో ఆమె నటించిన తీరు కన్నీళ్లు తెప్పిస్తుంది. భర్తతో ఎన్నో వేధింపులు ఎదుర్కొంటున్న మహిళల పాయింట్‌తో ఈ సినిమాలోని కథకు ఆమని తన నటనతో న్యాయం చేసింది. ఈ సినిమా చూసిన తర్వాత ఆమనిపై నటిగా గౌరవం పెరుగుతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు. భర్తగా నటించిన వికాశ్‌కి కూడా నటునిగా మంచి మార్కులు పడతాయి. మిగతా నటీనటులు వారి వారి పాత్రల్లో చక్కగా కుదిరారు.

టెక్నికల్‌ విభాగం–
‘నారి’ సినిమాకు టెక్నికల్‌ విభాగం చాలా బలం అని చెప్పాలి. సినిమాలోని నేపధ్య సంగీతంతోపాటు పాటలు ఎంతో బావుండటానికి కారణం సంగీతదర్శకుడు విన్నూ వినోద్‌. మంచి ట్యూన్స్‌ని అందించాడు. కథను డిస్ట్రబ్‌ చేయకుండా తన సంగీతం ఉంటుంది. క్లైమాక్స్‌ సీన్లలో ఉండే బ్యాక్‌గ్రౌండ్‌ సినిమాను మరో లెవెల్‌కి తీసుకువెళ్తుంది. కెమెరా పినితీరు కూడా పరవాలేదనిపించేలా ఉందా. ముఖ్యంగా దర్శకుడు సూర్యకి కథపై పట్టుంది. అలాగే ఎక్కడ ఎలా ట్విస్ట్‌లు ఉండాలో ఉంటూనే తన కథనంతో ప్రేక్షకుణ్ని కట్టిపడేశాడు. ఇంటర్‌వెల్‌ సీన్‌ నుండి ప్రారంభించి కథను సెకండ్‌ హాఫ్‌లో నెక్ట్స్‌లెవెల్‌కి తీసుకెళ్లాడు అనటంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు. సినిమా చూస్తేనే ఆ విషయం ఏంటి? అనే క్లారిటి ఉంటుంది. అంతలా ఆకట్టునేలా తన మాటలు, కథనాలు ఉండటంతో దర్శకుడు సూర్య డిస్టెంక్షన్‌లో పాసై తొలి సినిమాతోనే చక్కని విజయాన్ని దక్కించుకున్నారు.

ప్లస్‌ పాయింట్స్‌–
ఆమని నటన
మాటలు, కథనం
నటీనటులందరి పనితీరు
సంగీతం…

మైనస్‌ పాయింట్స్‌–
ఫస్ట్‌హాప్‌ స్లో నేరేషన్‌
కొన్నిచోట్ల అవసరం లేని పాత్రలు

ఫైనల్‌ వర్డిక్ట్‌–
ప్రస్తుత సమాజంపై పూర్తి అవగాహనతో తీసిన సినిమా. టీనేజ్‌ పిల్లలతో పాటు ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా..

రేటింగ్‌– 2.75/5
శివమల్లాల

Also Read This :జాన్వీకపూర్‌ జన్మదినం సందర్భంగా ఆర్‌సి. 16లో లుక్‌ రివీల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.