అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8న రానుంది. గత ఏడాది ‘పుష్ఫ ది రూల్’ ఘటన జరిగిన తర్వాత బన్నీ మీడియాకు చాలా దూరంగా ఉంటూ వస్తున్నాడు. తన పనేదో తాను సైలెంట్‌గా చూసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటి వరకూ ‘పుష్ప 2’ తర్వాత బన్నీ ఏం సినిమా చేస్తున్నాడు? అనే విషయాలపై ఏవో గాసిప్స్ తప్ప అధికారికంగా ఏ సినిమానూ ప్రకటించింది లేదు. అయితే తన పుట్టిన రోజు సందర్భంగా మాత్రం అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడట. తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తాడని సమాచారం. ‘పుష్ప 2’ తర్వాత త్రివిక్రమ్‌తో బన్నీ సినిమా ప్రారంభిస్తాడని అంతా భావించారు.
అయితే ప్రి ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఆ సినిమాను పక్కనబెట్టి అట్లీతో సినిమాకు సిద్ధమవుతున్నట్టు టాక్ నడిచింది. అంతేకానీ ఈ వార్తల్లో నిజమెంత అనేది కూడా తెలియరాలేదు. త్రివిక్రమ్ – అల్లు అర్జున్, అట్లీ-అల్లు అర్జున్ ఏ ప్రాజెక్ట్ ముందు పట్టాలెక్కుతుందో అర్ధం కాక.. బన్నీ నుంచి అప్‌డేట్ వస్తుందా? అంటే వచ్చే పరిస్థితిలేక ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి ఓ స్పెషల్ ట్వీట్ వచ్చింది. ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ట్విటర్ వేదికగా అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 8 న స్పెషల్ కాదు షాకింగ్ సర్ప్రైజ్ రాబోతున్నట్టుగా ట్వీట్ వేశారు. ఈ ట్వీట్‌తో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఏం అప్‌డేట్ వస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోకి అక్షయ్ ఖన్నా
