Allu Arjun :
అల్లు అర్జున్ తన పుట్టినరోజు సందర్భంగా సినిమా అయితే అనౌన్స్ చేశాడు. అట్లీ కాంబోలో కనీవినీ ఎరుగని కథతో సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అట్లీ ఏదో పాన్ ఇండియా సినిమా తీస్తారని అంతా భావిస్తే ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా తీయబోతున్నారని వీడియో చూసిన వారంతా డిసైడ్ అవుతున్నారు. సైఫై థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఈ క్రమంలోనే సినిమా బడ్జెట్‌తో పాటు అల్లు అర్జున్, అట్లీ రెమ్యూనరేషన్ అంశం తెగ వైరల్ అవుతోంది. దేశంలోనే అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ సంస్థ సినిమాను రూ.700 కోట్లతో నిర్మించనున్నట్టు టాక్. దీనిలో బన్నీ, అట్లీ రెమ్యూనరేషన్లే రూ.300 కోట్లని సమాచారం. బన్నీ రూ.200 కోట్లు తీసుకుంటుంటే.. అట్లీ రూ.100 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ‘పుష్ప 2’ తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడంతో పాటు అట్లీ ట్రాక్ రికార్డ్ కూడా అద్భుతంగా ఉండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
ప్రజావాణి చీదిరాల
Also Read This : విడుదల తేదీపై మేకర్స్ క్లారిటీ