Allu Arjun:
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో తను కనబరచిన అద్భుతమైన నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతుండగా, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్. తెలుగు నటుడు జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం ఇదే మొదటిసారి. కాగా ఈ అవార్డు వేడుకలకు తన భార్య అల్లు స్నేహ రెడ్డి తో కలిసి ఢిల్లీ బయలుదేరిన బన్నీ ఈరోజు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా బన్నీ సతీమణి అల్లు స్నేహ రెడ్డి కళ్ళలో ఆనందాన్ని చూసి అక్కడ వారు కూడా సంతోషాన్ని వ్యక్త పరిచారు.
పుష్ప మొదటి పార్ట్ ఇచ్చిన సక్సెస్ తో సుకుమార్ అండ్ టీం పుష్ప పార్ట్ 2 నేషనల్ లెవెల్ లో యాక్షన్ సీక్వెన్స్ లు పెట్టి గ్రాండ్ గా షూట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.