Pushpa 2 Collections :
రెండువారాల్లో 1500 కోట్ల ప్లస్…
తెలుగు సినిమా రేంజ్ అమాంతం పెరిగిందా?
అయినా ఎందుకు ఈ మౌనం?????
గ్రేట్ క్రియేటివ్ జీనియస్ మ్యాథమేటిషియన్ టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరు సుకుమార్ మ్యాజిక్ భారతదేశం అంతటా బాక్సాఫీస్ ప్రభంజనాన్ని సృష్టించింది.
‘పుష్ప–2’ సినిమా కలెక్షన్లు రెండువారాల్లో ఎవరు ఊహించని విధంగా 1500 కోట్ల గ్రాస్‌ని సాధించి ఫాస్టెస్ట్ 1500క్రోస్ క్లబ్‌లో చేరింది.
నటనపరంగా అల్లు అర్జున్ పూనకాలు తెప్పించి తన మార్క్‌తో మెస్మరైజ్ చేసి తన కాలు మీద కాలేసుకుని శీతాకాలంలో ఎవరెస్ట్ ఎక్కి కూర్చున్నాడు.
ఎన్నిరకాల అవాంతరాలు ఎదురైనా కూడా ‘పుష్ప–2’ సినిమా అవాంతరాలను సైతం లెక్కచేయకుండా రెండువారాల తర్వాత కూడా స్టడీగా తన కలెక్షన్లను సాధిస్తుంది.
దర్శకునికి, హీరోకి ఒకరిపై ఒకరికి నమ్మకముండి కష్టపడితే ఏరేంజ్ ఫలితం వస్తుందో నిరూపించిన సినిమా ఇది.
మైత్రిమూవీస్ అధినేతలు , సినిమా యూనిట్‌కి పట్టలేనంత ఆనందంగా ఉన్నా ఎవరు గొప్పగా సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితుల్లో ప్రతి టీమ్ మెంబర్ ఉన్నారు.
దానికి కారణం సంధ్య థియేటర్ ప్రీమియర్‌షో ఘటన అని అందరికి తెలుసు.
ఏదేమైనా అది దురదృష్టకరమైన సంగతి కావటంతో ఇంత పెద్ద విజయాన్ని టీమ్ ఆస్వాదించలేకపోతుంది అన్నది నిజం.
ఇందులో ఎటువంటి మొఖమాటం లేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాబు వీలైనంత త్వరగా బయటకి రావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ ఉధంతం దీనికి అధనం. బన్నీ బెయిల్‌పై బయటికొచ్చిన ఎక్కడో తెలియని అసహనం ప్రతి ఒక్కరిలోను వెంటాడుతోంది.
గతంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరిగాయి. అవన్నీ చాలా ఈజీగా సమసిపోయిన గాయాలు.
ఈ గాయం మాత్రం చాలా పెద్దది..మామూలు రోజుల్లో అయితే సినిమాలు ఆడినా ఆడకపోయినా సక్సెస్‌మీట్‌లు ఫేక్ నంబర్లతో చిత్ర పరిశ్రమ హడావిడి చేస్తుంటుంది.
100 కోట్ల క్లబ్, 200, 300, 400కోట్లు…. అని ఇలా ప్రతి వందకి ఎంతో హడావిడి ఉంటుంది.
కానీ 1500 కోట్ల మార్కును దాటినాకూడా ఒక మరణం మాటను బయటకి రానివ్వటంలేదు.
ఏదేమైనా సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమాటీమ్‌ను ముఖ్యంగా హీరో, హీరోయిన్లు మిగిలిన నటీనటులను మెయిన్ టెక్నికల్‌టీమ్‌ని,
కెప్టెన్ ఆఫ్ ది మూవి సుకుమార్‌ని మనసులోనే అభినందిస్తున్నారు. అందుకే అంత పెద్ద విజయం సాధించిన అందరిలో ఈ మౌనం……
శివమల్లాల
Also read this : ఈ బర్త్‌డే ఆయనకెంతో ప్రత్యేకం…