పుష్ప 2‘ సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో ఈ ఘటనపై మాట్లాడిన సీఎం, సంధ్య థియేటర్ వద్ద సినిమా చూడటానికి అల్లు అర్జున్‌కు ఎలాంటి అనుమతి లేదని, ఈ విషయాన్ని ముందే పోలీసులు చెప్పారు.
అయినప్పటికీ, ఆయన థియేటర్‌కు వెళ్లారని, థియేటర్ వద్ద భారీ రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగింది. ఇందులో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయి, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
అయినా కూడా, హీరో అల్లు అర్జున్ ధియేటర్ లో కూర్చుని సినిమా చూస్తూ, ఈ ఘటనపై ఎలాంటి స్పందన కూడా ఇవ్వలేదు.
తొక్కిసలాట గురించి తనకు తెలియజేసినా, అల్లు అర్జున్ సినిమా చూస్తేనే ఉన్నారని రేవంత్ అన్నారు.
అతని వెంటే ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు పదేపదే అతన్ని బయటకు వెళ్లాలని చెప్పినా ఆయన పట్టించుకోలేదు.
చివరికి, డీసీపీ కఠినంగా ఆదేశించి, సినిమా మధ్యలోనే అతన్ని బయటకు పంపించారు.
అయినప్పటికీ అల్లు అర్జున్ థియేటర్ నుండి బయటకు వస్తూ చేతులు ఊపుతూ ర్యాలీ చేయడం సరైన చర్య కాదని రేవంత్ అన్నారు.
ఈ ఘటనలో ప్రజల ప్రాణాల గురించి హీరో మరచిపోయి, అత్యంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం, సమాజంలో తన పాత్రను మర్చిపోయినట్లే అని సిఎం అన్నారు.
సంజు పిల్లలమర్రి