allu arjun and trivikram :
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సెకండ్ పార్ట్ లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శేరవేగంగా జరుగుతుంది. పుష్ప పార్ట్ 1 ఇచ్చిన సక్సెస్ పార్ట్ 2 ని మరెంత హైప్ చేసింది. అయితే పుష్ప తరువాత బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని కూడా బ్యాక్ టు బ్యాక్ లైన్ లో పెడుతున్నాడు. వాటిలో ముఖ్యమైనది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా.
వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే. నాలుగోవ సినిమా గా వీరి కాంబో లో డిస్కస్ అవుతున్న సినిమా కూడా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో ఉండనుంది అని సమాచారం. ఈ సినిమా ముంబై బ్యాక్డ్రాప్ పోలీస్ కథ అని టాక్. వచ్చే ఏడాది జనవరి మూడో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది అని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాను హారిక & హాసిని క్రియేషన్స్ అండ్ గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాయి. కాగా ఈ సినిమాకి థమన్ సంగీత దర్శకుడిగా, పూజ హెగ్డే హీరోయిన్ గా చేయనున్నారు.
Also Read: Famous Telugu Producers : చాపకిందనీరులా తమిళంలోకి తెలుగు నిర్మాతలు…
Also Read
pawan kalyan :
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు తమ ప్రత్యర్థులు ప్రచారానికి రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రభుత్వ అధికారులను, పోలీసులను ఉపయోగించుకుంటున్నారు.
ఉన్నత పదవుల్లో కొన్ని మార్పులు వచ్చినా చాలా మంది అధికారులు జగన్ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు.
కాకినాడలో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన కార్యక్రమాలకు అనుమతి నిరాకరించడంతో ఆయా పార్టీల నాయకుల్లో నైరాశ్యం నెలకొంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ అన్యాయాన్ని ప్రత్యక్షంగా చూశారు.
కాకినాడ నగరంలో జనసేన, టీడీపీ నేతలు రోడ్ షో చేయాలని భావించినా అధికారులు అనుమతి ఇవ్వలేదు.
వైసీపీ ఎమ్మెల్యే అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని ప్రజలు విమర్శిస్తుండగా, జనసేన, టీడీపీ, బీజేపీ మద్దతుదారులు తమ అభిమాన నేతను చూడలేక ఆందోళన చెందుతున్నారు. ఎట్టకేలకు రోడ్ షోకు అనుమతి లభిస్తుందా అని ఎదురు చూస్తున్నారు.