శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సింగిల్’. కార్తీక్ రాజు దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘సీరియస్, ఎమోషనల్ లవ్ స్టోరీగా తీసిన ‘తండేల్’ చాలా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా జరుగుతున్నప్పుడే సరదాగా నవ్వుకునే ఒక కథ చేయాలని విద్యాకి చెప్పడంతో ఆయన ‘సింగిల్’ కథని తీసుకొచ్చారు. డైరెక్టర్ కార్తీక్ ఈ కథ చెప్తున్నంత సేపూ పగలబడి నవ్వుతూనే ఉన్నా. ఈ సినిమాలో శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ కనిపించినప్పుడు నవ్వులు మామూలుగా ఉండవు. ఈ సినిమా సమ్మర్‌కి యాప్ట్ అయ్యే సినిమా కాబట్టి దీనిని సమ్మర్‌కే రిలీజ్ చేద్దామని అనుకున్నాం. క్రాక్రోచ్ థియరీని ఎవరూ అపార్థం చేసుకోకూడదు. అటామిక్ బాంబు పేలినా బతకగలిగే రెజిలియర్స్ ఉన్న జీవి కాక్రోచ్ కాబట్టి ఆ రెజిలియన్స్ క్వాలిటీ గురించి చెప్పేందుకే డైలాగ్ వాడాం. దాన్ని అపార్థం చేసుకోవద్దు’’ అని పేర్కొన్ానరు.
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘‘ఇంటిల్లిపాది కడుపుబ్బ నవ్వించాలనే ప్రయత్నంతో ఈ సినిమా చేశాం. వెన్నెల కిషోర్, కేతిక, ఇవాన .. ఇలా మంచి టీమ్ అంతా జాయిన్ అయిన తర్వాత ఇరగబడి నవ్వించాలనే కసి కలిగింది. సినిమా స్క్రీన్ ప్లే, స్టొరీ చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు. హీరోయిన్ కేతిక శర్మ మాట్లాడుతూ.. ‘‘విష్ణు గారు, వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. హీరోయిన్ ఇవాన మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఫన్ రైడ్ కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తూ సినిమా చేశాను. తప్పకుండా థియేటర్లో చూసి సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. వెన్నెల కిషోర్ మాట్లాడుతూ.. ‘‘ డైరెక్టర్ కార్తీక్ రాజు గారికి థాంక్యూ. ఆయన ఇప్పటి వరకూ తీసిన అన్ని సినిమాల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా తన తదుపరి చిత్రంలో రోల్ ఉందని చెప్పారు. మంచి కల్ట్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ కేతికే శర్మ గారు. ఆమె ఫ్యాన్స్‌లో నేను ఒకడిని (నవ్వుతూ). ఇవానతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. డైరెక్టర్ కార్తీక్ రాజు మాట్లాడుతూ .. ‘‘అల్లు అరవింద్ గారితో కలిసి వర్క్ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీ విష్ణు గారితో కలిసి పనిచేయడం ఒక ప్రౌడ్ మూమెంట్’’ అన్నారు.
ప్రజావాణి చీదిరాల