...

‘ఆల్కహాల్‌’లో మునిగిపోయిన అల్లరి నరేష్

హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న అల్లరి నరేష్, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అదే కోవలో మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్‌తో చేతులు కలిపారు. ‘ఫ్యామిలీ డ్రామా’ ఫేమ్ మెహర్ తేజ్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి తాజాగా టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దానికి సంబంధించిన పోస్టర్‌ను నేడు మేకర్స్ విడుదల చేశారు. అల్లరి నరేష్ చిత్రానికి ‘ఆల్కహాల్’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు. పోస్టర్‌లో అల్లరి నరేష్ ఆల్కహాల్‌లో మునిగిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇది భ్రమ, వాస్తవికత మధ్య జరిగే కథలా కనిపిస్తోంది. ఈ సినిమాలో రుహాని శర్మ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

చీదిరాల ప్రజావాణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.