Akhil Birthday Special :
అతనికి అన్ని ఉన్నాయి, మంచి ఫ్యామిలీ, ఆస్థి, డబ్బు, చిన్నపటి నుండే ఫేమ్, కాని చెప్పుకోవడానికి ఒక్క ప్రొపర్ హిట్ కూడా లేదు, అలా అని టాలెంట్ లేదా? కష్టపడడా? అంటే తన వయస్సుకు మించిన కష్టం చేస్తాడు, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇండియా లో స్పైడర్ మాన్ సినిమా తియ్యాలి అంటే అతని కన్నా బెస్ట్ ఛాయస్ ఇంకొకరు ఉండరు. అంతటి పోటేన్షియాలిటి ఉన్న యాక్టర్. అతనెవరో కాదు అఖిల్ అక్కినేని..
నెలలు కూడా పూర్తిగా నిండకముందే, పాకే వయసులో ఉన్నప్పుడే సిసింద్రి సినిమాలో నటించి అందరు షాక్ అయ్యేలా చేశాడు అఖిల్. అసలు ఆ పాత్ర ఎలా చేశాడు అని అప్పట్లో సినీ ప్రముఖులే ఆశ్చర్యపోయారు. ఈ సినిమా అఖిల్ తో చేయించాడనికి ఒప్పుకున్న నాగార్జున గారికి, అమలా గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, చాలా రిస్కీ షాట్స్ ఉంటాయి సినిమాలో, అంత చిన్న పిల్లోడి హెల్త్, సెక్యూరిటీ ఇలా ఎన్నో భయాలు ఉంటాయి. తన చుట్టూ ఏం జరుగుతుందో అర్ధం కాకుండా ఎప్పుడు క్రూ మెంబెర్స్ కెమెరా, లైట్స్ తో ఉన్నా కూడా భయపడకుండా అఖిల్ ఆ సిసింద్రి క్యారెక్టర్ చెయ్యడం మాములు విషయం కాదు..
సర్రిగా పదేళ్ళ క్రితం ‘మనం’ సినిమాలో చిన్న కేమియో లో అఖిల్ కనిపించిన విధానం చూస్తే, నెక్స్ట్ వీడు ఇండస్ట్రీని ఏలుతాడు రా బాబు అనుకేలా ఉంది ఆ లుక్. ఆ స్టైల్ కి నిజంగా ఆడియన్స్ ఫిదా అయిపోయారు, వీడు బార్న్ యాక్టర్ రా బాబు అనుకున్నారు..
సరైన డెబ్యు ఫిలిం 2015లో వినాయక్ గారి దర్శకత్వంలో ‘అఖిల్’ సినిమాతో చేశారు. ఈ సినిమాలో స్టంట్స్ ఒరిజినల్ గా చెయ్యడానికి థాయిలాండ్ వెళ్లి రెండు నెలలు వర్క్ షాప్స్ అటెండ్ అయ్యి ప్రాక్టీసు చేశారు. అంత కష్టపడినప్పటికీ కూడా ఆ సినిమా హిట్ అవ్వలేదు.. రెండేళ్ళు అఖిల్ మళ్ళి ప్రేక్షకుల ముందుకు రాలేదు. రావడం రావడమే ఏదో ప్రపంచాన్ని కాపాడేసే పెద్ద పెద్ద సినిమాలు మనకొద్దు, ముందు మంచి లవ్ స్టొరీ తీద్దాం అనుకుని ‘హలో’ తో మన ముందుకు వచ్చారు, హలో సినిమా ఫస్ట్ గ్లింప్స నుండే పెద్ద అంచనాలు ఆ సినిమా మీద పెట్టుకునేలా చేసింది.. స్టంట్స్ చూసే థియేటర్స్ అన్ని అరుపులతో మోత మోగిపోయాయి, సింపుల్ స్టొరీ డీసెంట్ పెర్ఫార్మన్స్, ఈ సారి కచ్చితంగా హిట్ పడింది అనుకునే లోపే, నాని “మిడిల్ క్లాస్ అబ్బాయి ” కూడా అదే టైంకి రిలీజ్ అవ్వడంతో, హలో స్టాండ్ అవుట్ అవ్వలేకపోయింది, బీలో యావరేజ్‌గా నిలిచింది.
ఎంతైనా ఒక పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో భుజాల మీద ఎపుడు తెలియని ఒక బ్యాగేజ్ ఉంటుంది. ఆ బ్యాగేజ్ సక్సెస్ వచ్చే వరుకు ఒకరకమైన పెయిన్ ఇస్తుంది, సక్సెస్ వచ్చాక దాని నిలబెట్టుకోవాడానికి ఇంకో రకమైన పెయిన్ ని ఇస్తుంది.. అందుకే అఖిల్ మళ్ళి 2 సంవత్సరాలు తీసుకుని Mr.మజ్ను తో వచ్చాడు.. ప్రీ రిలీజ్ కే అదిరిపోయే బజ్ వచ్చింది ఈ సినిమాకి, మ్యూజిక్ ఆల్బమ్ కూడా బాగా సక్సెస్ అయ్యింది. తొలిప్రేమతో వెంకి అట్లూరి కూడా తను లవ్ స్టోరీస్ బాగా హేండిల్ చెయ్యగలను అని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సారి ఈ సినిమా హిట్ అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు అనుకున్నారు అంతా, కాని ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది..
మాములుగా స్టార్ కిడ్స్ కి హ్యాట్రిక్ హిట్స్ ఉంటాయి కాని అఖిల్ కి అలా కాదు, ధోని ఫస్ట్ మ్యాచ్ లోనే అవుట్ అయినట్టు అఖిల్ కి హ్యాట్రిక్ ఫ్లోప్స్ వచ్చాయి.. ఈ సారి మళ్ళి రెండేళ్ళు గ్యాప్ తీసుకున్నారు అఖిల్, కొంచం కొత్తగా ట్రై చేద్దాం అని లుక్ మర్చి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ గా మన ముందుకు వచ్చారు, డైరెక్టర్ బొమ్మరిల్లు బాస్కర్ గారికి హిట్స్ లేవు, ఎలా రా దేవుడా, ఈ సినిమా అయిన హిట్ అవ్వాలని అక్కినేని ఫాన్స్ కోరుకున్నారు.. ఆ కోరికల మేరకే అఖిల్ కెరీర్ లో మొదటి సక్సెస్ ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.
అఖిల్ లో ఒక స్పెషాలిటి ఏంటి అంటే, అందరి హీరోలకి హిట్స్ వచ్చాకే ఫాన్స్ ఉంటారు, కాని అఖిల్ కి చిన్నప్పటి నుండి ఫాన్స్ ఉన్నారు, ముఖ్యంగా అమ్మాయిల్లో అఖిల్ ఫాన్స్ ఎక్కువ, అఖిల్ క్రికెట్ ఆడినప్పుడు కూడా ఆ గ్రేస్ చూసి సినిమాల్లోకి వస్తే అసలు అఖిల్ ని ఎవ్వరూ ఆపలేరు అనుకునే వారు అందరూ. అలాంటి అఖిల్ కి హీరో అయిన 7 సంవత్సరాలకి సక్సెస్ వచ్చింది.. ఆ నెక్స్ట్ మళ్ళి ఇంకో రెండేళ్ళు టైం తీసుకుని బాడీ ట్రాన్స్ఫార్మేషన్ చేసి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాని ఏజెంట్ తో వచ్చాడు.. ఒకే ఒక్క హిట్ ఉన్న హీరో కి 80 కోట్లు బడ్జెట్ పెట్టి మరి చేశారు ఈ సినిమాని, యాక్షన్ ఉంది కాని కథ చెప్పడంలోనే ఫెయిల్ అయింది ఈ సినిమా, మళ్ళి ఇంకో ఫ్లోప్ ని తన ఎకౌంటులో వేసుకున్నారు అఖిల్..
నిజానికి అఖిల్ కి ఉన్న ప్యాషన్ కి, అఖిల్ కి ఉన్న డెడికేషన్ కి, హిట్ కోసం అఖిల్ చూపించే నిబద్ధతతో కూడిన ప్రయత్నానికి, ఈ పాటికే అఖిల్ కి చాలా పెద్ద హిట్స్ రావాలి కాని అలా రాకపోవడానికి మెయిన్ గా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి స్టొరీ సెలక్షన్, రెండు అఖిల్ ప్రతి సినిమాకి రిలీజ్ కి ముందే భయంకరమైన బజ్ వస్తుంది.. కాదు కాదు బజ్ వచ్చేలానే మార్కెటింగ్ మెటీరియల్ ని రిలీజ్ చేస్తారు.. కాని ఆ బజ్ వల్ల సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. అఖిల్ కట్ అవుట్ కి అఖిల్ కి ఉన్న చార్మ్ కి ప్రేక్షకులు కూడా అఖిల్ నుండి చాలా యక్స్పెక్ట్ చేస్తారు.. ఒక మంచి స్టొరీ కి, సింపుల్ టీజర్ అండ్ ట్రైలర్ కట్స్ తో పెద్దగా అంచనాలు పెంచకుండా, ఒక షో పడ్డాక మౌత్ టాక్ ద్వారా సినిమా ప్రమోట్ అయ్యేలా చేస్తే బెటర్. ఏది ఏమైనా గొప్ప విషయాలకు సమయం పడుతుంది, ఇలానే అఖిల్ గేవ్ అప్ ఇవ్వకుండా ప్రయత్నిస్తే అఖిల్ కి ఉన్న సామర్ధ్యానికి సూపర్ స్టోరీస్ ని తియ్యొచ్చు.. పెద్ద సక్సెస్ లని టేస్ట్ చెయ్యొచ్చు.. హ్యాప్పీ బర్త్ డే అక్ఖినేని అఖిల్.
Also Read This Article : పుష్ప ది రూల్ టీజర్ రివ్యూ