గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవం సాధించారు. లండన్ మేడమ్ టుసాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహం కొలువుదీరింది. తన పెంపుడు కుక్క రైమ్‌తో కలిసి ఉన్న మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్‌లో ఆవిష్కరించారు. క్వీన్ ఎలిజబెత్ II తర్వాత పెంపుడు జంతువుతో నిలిచిన ఏకైక సెలబ్రిటీగా రామ్ చరణ్‌కు ఈ అరుదైన గౌరవాన్ని దక్కింది. ఈ ఆవిష్కరణ సమయంలో ఎమోషనల్ మూమెంట్ అని చెబుతారు. లండన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ తన డాగ్ రైమ్‌తో పాటు కుటుంబమంతా హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రకటనను వాయిదా వేయాలని భావించారు.
దేశంలో కొంత శాంతియుత పరిస్థితులు నెలకొనడంతో ఈ క్షణాన్ని తమ అభిమానులతో పంచుకోవాలని మెగా ఫ్యామిలీ భావించింది. రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆయన 2023 ఆస్కార్ వేడుకకు వేసుకున్న నలుపు రంగు వెల్వెట్ బంధ్ గాలా దుస్తులతో తయారు చేశారు. ఈ విగ్రహం ఆయన విజయాన్ని మాత్రమే కాకుండా.. ఆయనకు తన పెంపుడు జంతువుతో ఉన్న బంధాన్ని కూడా తెలియజేస్తుంది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ విగ్రహాన్ని సందర్శించేందుకు విజిటర్స్‌ను మే 19 వరకూ అనుమతించనున్నారు. ఆ తర్వాత విగ్రహాన్ని ప్రదర్శన కోసం మేడమ్ టుసాడ్స్ సింగపూర్‌కి తరలిస్తారు.
ప్రజావాణి చీదిరాల