Actress Pramodini :
సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా నటించిన కమల్‌హాసన్, శ్రీదేవి, అలీలు తర్వాత కాలంలో ఎంత గొప్ప నటులుగా మారారో అందరికి తెలిసిందే.
– వారికోవలో బాలనటిగా తన కెరీర్ ప్రారంభించిన ఈ నటి కూడా 17 ఏళ్లు వచ్చేసరికే హీరోయిన్‌గా మారారు.
ఆమె హీరోయిన్‌గా నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా హడావిడి చేయలేదు.
దానికి తోడు ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు అనే నాన్న…విసిగిపోయిన ఆ నటి 2004లో పెళ్లి చేసుకుని విమానం ఎక్కేసి భర్తతో అమెరికాకి వెళ్లిపోయారు.
–కట్‌చేస్తే భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో మళ్లీ తన కెరీర్‌ను గాడిలో పెట్టాలనుకున్నారు ఆ నటి. ఏమి ఆలోచించకుండా ఇండియాకి వచ్చేసారు.
పుట్టింది కర్ణాకటలో, పెళ్లి చేసుకుంది తమిళనాడులో, నటిగా పేరు తెచ్చుకుంది తెలుగులో…అందుకే హైదరాబాద్‌లో స్థిరపడ్డారామె.
తెలుగు, తమిళ, కన్నడ మిక్స్‌డ్ మసాలా మణికొండలో ఉంటుంది…
– దాదాపు 70 సినిమాలకు పైగానే హీరోయిన్ తల్లిగా, హీరోకి మదర్‌గా రకరకాల పాత్రల్లో నటించిన ఆమెకు ‘రామం రాఘవం’ సినిమాలో కమలమ్మ పాత్రనిచ్చి
మీరు చేయగలరు అని చెప్పి ఎంతో ఎంకరేజ్ చేయటంతో చాలా గొప్పగా నటించి మంచిమార్కులు తెచ్చుకున్నారామె. ఆమె పేరు ప్రమోదిని.
– సినిమాల్లో నటించే హీరో, హీరోయిన్లకు మాత్రం ఏడాదికి రెండు మూడు సినిమాలుంటే గొప్ప..
కానీ క్యారెక్టర్ నటులకు మాత్రం ఏడాదికి పదినుండి ఇరవై సినిమాలు చేస్తామని
ఈ ఏడాది ఇంకా 20 సినిమాలు విడుదల అవుతున్నాయని చాలా ఆనందంగా చెప్పారామె.
– ఈ సినిమాలో నటించిన తర్వాత ఫుల్ హ్యాపీగా ఉన్నాను .
సముద్రఖని వంటి గొప్ప నటునితో పనిచేయటంతో పాటు నటుడు ధన్‌రాజ్ దర్శకునిగా మారి చేస్తున్న తొలి చిత్రంలో ఎంతో పెద్ద రోల్ ఇచ్చి ప్రోత్సహించారు.
‘రామం రాఘవం’ వంటి మంచి చిత్రాన్ని నిర్మించిన పృథ్వీ పోలవరపు ఫ్యామిలీ మెంబర్‌లా దొరికాడు.
అంటూ తన ప్రొఫెషనల్, పర్సనల్ స్టోరీని సరదాగా ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ ఛానల్‌తో పంచుకున్నారామె. ఇంటర్వూ బై శివమల్లాల…
Also Read This : నాని బర్త్‌డే స్పెషల్ ఆర్టికల్…