పండిత పుత్రుడితను…పరమ శుంటేమోనని తనకు తానుగా అనుకున్నాడు…
మీరు పరమ డాష్ డాష్… కాదు అని ప్రేక్షకులు ఇతనిపై ‘అమృతం’ కురిపించారు.
కట్‌చేస్తే అమృతం తాగాడు. అమృతంలో దొర్లాడు..అమృతంలో మునిగాడు..
అయ్యబాబోయ్ ఈయన బుల్లితెర నటుడు కాదు..70 యంయం స్క్రీన్‌పైకొస్తే బావుంటుంది అనుకున్నారు.
ఇలా అనుకోగానే అలా వచ్చాడు. ఎన్నో సినిమాల్లో నటించారు. చిన్న పాత్రలో కనిపించినా మెరిసేవాడతను.
‘గుండెజారి గల్లంతయ్యింది’, ‘మనం’ చిత్రాలతో రైటర్‌గా తన రేంజ్ ఏంటో ప్రపంచానికి అర్థమయ్యింది.
పెళ్లి వద్దు అంటాడు…చేసుకోవద్దు అని సలహా ఇస్తాడు….రెండు రోజుల క్రితం విడుదలైన ‘కోర్టు’ సినిమాలో దాము పాత్రలో విజృంభించి వాదించి ఓడిపోయాడు.
సినిమాలో ఓడినా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు.
సరే ‘అమృతంగారు’ ఒక ఇంటర్వూ ఇవ్వండి అని అడగ్గానే వచ్చాడు, ఇచ్చాడు, వెళ్లాడు.
ఆ ఇంటర్వూ అంతా గొడవలు, యుద్ధాలు ఉన్నట్లు పది పాయింట్లు తీసేయమన్నాడు.
సరే అన్నాను కానీ…కొన్ని అలాగే ఉంచేశాను.
ఎందుకంటే ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఓపెన్ ఐపోయాడు. గట్టిగానే కొట్టుకున్నాం.
ఎలా కొట్టుకున్నామో మీరు ఓ లుక్కేయండి…ఫస్ట్‌పార్ట్ ఇంటర్వూ ఇది. ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : డియర్ నిర్మాతల్లారా….వెల్‌కమ్ టు ద ఇండస్ట్రీ
