మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇటీవలి కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. సినిమా సెట్స్‌లో డ్రగ్స్ తీసుకుని అసభ్యంగా ప్రవర్తించాడంటూ నటి విన్సీ సోనీ అలోషియస్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆమె షైన్ టామ్ చాకోపై కేరళ ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు ‘అమ్మ’ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మరువక ముందే షైన్ టామ్ చాకో మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. వెంటనే రంగంలోకి దిగిన నార్కోటిక్ పోలీసుల బృందం.. హోటల్‌పై రైడ్ చేసింది.
హోటల్‌లోని మూడో అంతస్తులో షైన్ టామ్ చాకో బస చేశారు. పోలీసుల రాక విషయం తెలుసుకున్న ఆయన వెంటనే కిటికీలో నుంచి బయటకు దూకి మెట్ల మార్గంలో పారిపోయినట్టు సమాచారం. అయితే పోలీసులు హోటల్‌కు రావడానికి ముందే విషయం తెలుసుకున్న నటుడు మూడవ అ రావడంతో నార్కోటిక్ పోలీసుల బృందం అక్కడ రైడ్ చేసింది.బుధవారం ఉదయం 11 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు వార్తలు వినవస్తున్నాయి. మరోవైపు టామ్ చాకోపై నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దీనిపై విచారణకు ఓ కమిటీ ఏర్పాటు చేసినట్టు సమాచారం.