Vijay Sethupathi: యాక్షన్, రొమాన్స్ అన్నింటి కలబోతే ‘ఏస్’

వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన చిత్రం ‘ఏస్’. ఈ సినిమా మే 23న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శక, నిర్మాత అరుముగ కుమార్ రూపొందించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. దివ్యా పిళ్లై, పృధ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మే 23న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. విజయ్ సేతుపతి మాట్లాడుతూ .. ‘‘అరుముగ కుమార్ నాకు తొలి సినిమా చాన్స్ ఇచ్చారు. ఇన్నాళ్ల తర్వాత తిరిగి ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది. ఇందులో యాక్షన్, రొమాన్స్ అన్ని అంశాలు ఉంటాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగా వచ్చింది’’ అని తెలిపారు.

శ్రీ పద్మిణి సినిమాస్ అధినేత దర్శక, నిర్మాత బి.శివ ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘ఏస్’ సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అవబోతున్నట్టు అందరి మొహాల్లో సంతోషం చూస్తేనే తెలుస్తోంది. ఈ కథ, కారెక్టర్స్ అన్నీ అద్భుతం. విజయ్ సేతుపతి మళ్లీ అందరినీ ఆకట్టుకోబోతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ‘రొమాంటిక్ డాన్’ అనే సినిమాను ఆయనతో త్వరలోనే ప్రకటిస్తాను. ‘ఏస్’ సినిమాగానూ అందరికీ ముందుగానే కంగ్రాట్స్. మే 23న ఈ చిత్రం పెద్ద విజయం సాధించబోతోంది’’ అని అన్నారు.

దర్శక, నిర్మాత అరుముగ కుమార్ మాట్లాడుతూ .. ‘‘ఏస్’ సినిమాలో యాక్షన్, రొమాన్స్, ఫన్ ఇలా అన్నీ రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. మే 23న మా సినిమాను అందరూ చూడండి’’ అని అన్నారు. నటుడు పృథ్వీ రాజ్ మాట్లాడుతూ .. ‘‘ఏస్’ నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనదే కాకుండా ఫుల్ మీల్స్ లాంటి చిత్రం. ప్రస్తుతం వరుసగా ప్రాజెక్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నా. కార్డ్‌లో ‘ఏస్’ అనేది అన్నింటి కంటే హయ్యస్ట్ కార్డ్. అరుముగ గారి మైండ్‌లో మొత్తం స్క్రిప్ట్ ఉంటుంది. విజయ్ సేతుపతి గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఇది డార్క్ కామెడీతో రాబోతున్న సినిమా కావడంతో ప్రారంభం నుంచి చివరి వరకు ఫుల్ ఫన్ ఉంటుంది’’ అన్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *