బాలనటులుగా వచ్చినవాళ్లు అందరూ పెద్దయిన తర్వాత కూడా నటులుగా రాణించాలని రూలేం లేదు. అలా రాణించినవారు వెళ్లమీద లెక్కపెట్టేంత తక్కువమంది ఉంటారు.
అలాంటి కోవలోకి వచ్చే ఈ బాలనటుడు అభినవ్ తన అమ్మా,నాన్న ఇచ్చిన ప్రోత్సాహంతో కెరీర్‌ను చిన్నప్పటినుండి నటనకే అంకితం చేసుకున్నారు.
మన దగ్గర కంటెంట్ ఉండాలి కానీ ఎక్కడైనా నటించి మార్కులు కొట్టేయొచ్చు అని తనను తాను నిరూపించుకుంటున్నాడు.
తాను లీడ్‌గా నటిస్తోన్న అనేక షార్ట్‌ఫిల్మ్స్ ఇప్పుడు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సాధిస్తూ సోషల్ మీడియాలో తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చిపెట్టాయి.
అనేక సినిమాల్లోకూడా నటిస్తోన్న అతన్ని ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ చానల్ ఇంటర్వూ చేయగా ఇంటర్వూలో అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.
మహేశ్‌బాబు హీరోగా నటించిన మురారి సినిమాతో తన కెరీర్ స్టార్ట్ అయ్యిందని
పవన్‌కల్యాణ్ చిన్నప్పటి పవన్‌లా చిన్న బాలకృష్ణలా, చిన్న మహేష్‌లా ఇలా ఎంతోమంది హీరోలకు బాలనటునిగా నటించానని చెప్పారు అభినవ్.
దర్శకుడు కృష్ణవంశీ తనను తిట్టారని, ‘హనుమాన్’ హీరో తేజా సజ్జాతో కలిసి అనేక సినిమాల్లో నటించానని ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.
ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : స్టార్ హీరోలతో వరుసగా 10 సినిమాలు…