తెలంగాణలో బెట్టింగ్ యాప్ల వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేందుకు పెద్ద మొత్తంలో కొందరు సెలబ్రిటీలు పారితోషికం అందుకున్నారంటూ కేసులు నమోదయ్యాయి. ఈ బెట్టింగ్ యాప్ల కారణంగా చాలా మంది అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే రానా నేడు (బుధవారం) ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. కానీ రానా విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలని ఈడీని కోరాడు.
ముందస్తు కార్యక్రమాలు, షూటింగ్ల వల్ల బుధవారం విచారణకు హాజరు కాలేనని, తనకు కొంత గడువు కావాలని రానా.. ఈడీని కోరారు. ఆయన చేసిన అభ్యర్థనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పందించారు. ఆగస్టు 11న కచ్చితంగా విచారణకు రావాలని తేల్చి చెప్పారు. ఈ నెల 30 నుంచి ప్రకాశ్ రాజ్ మొదలు వరుసగా విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిని అధికారులు విచారించనున్నారు. ఈ మేరకు వారికి నోటీసులు సైతం అందాయి. వీరే కాకుండా పలువురు బుల్లితెర నటులు, యూట్యూబర్లకు సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది.