డబ్బుంటే చాలు.. సైజ్ జీరో అవడం ఎంతసేపు? అనిపిస్తుంది కదా. ఇది కొంతవరకూ నిజమే. ఇటీవలి కాలంలో బరువు తగ్గించుకోవడం చాలా ఎక్స్‌పెన్సివ్‌గా మారిపోయింది. ఎలాంటి శారీరక ఇబ్బందులు లేకుండా బరువు తగ్గించుకోవడానికి డబ్బు ఖర్చు చేయాల్సిందే. ఒకప్పుడంటే హీరోయిన్లు బొద్దుగా ఉన్నా ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు బొద్దుగా ఉంటే ఆడియన్స్ ఏమాత్రం నచ్చడం లేదు. దీనికోసం ముద్దుగుమ్మలు నానా తిప్పలు పడుుతన్నారు. బాలీవుడ్ భామ కరీనా కపూర్ ఎప్పుడు చూసినా స్లిమ్‌గానే కనిపిస్తూ ఉంటుంది. ఆమె వయసు నాలుగు పదులు దాటినా.. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా బరువులో మాత్రం తేడా రాలేదు. దీనికి అసలు సీక్రెట్‌ను ఆమె డైటీషియన్ రుజుత దివికర్ బయటపెట్టారు. 2008 నుంచి కరీనాకు రుజుత డైటీషియన్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రుజుత మాట్లాడుతూ.. 18 ఏళ్లుగా కరీనా ఒకే రకమైన ఆహారాన్ని తీసుకుంటోందంటూ వెల్లడించారు. అంతేకాదండోయ్.. ఆమె ఉదయం నుంచి నైట్ వరకూ డైలీ ఏం తీసుకుంటారో కూడా వివరించారు.
కరీనా ఉదయం లేవగానే ఫ్రెష్ అయిన తర్వాత డ్రైఫ్రూట్స్ అంటే రాత్రంతా నానబెట్టిన బాదం, అంజీరా, కిస్‌మిస్ తీసుకుని ఆ తరువాత వ్యాయామాన్ని ప్రారంభిస్తుందట. ఇక బ్రేక్‌ఫాస్ట్ విషయానికి వస్తే పరాటా లేదంటే పోహా తింటుందట. అక్కడి నుంచి లంచ్ చేసే వరకూ మంచినీళ్లు తాగుతూనే ఉంటుందట. మధ్యాహ్నం లంచ్‌లో అన్నం, పప్పు తీసుకుంటుందట. సాయంత్రం స్నాక్స్ ప్లేస్‌లో చీట్ టోస్ట్ లేదంటే సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటుందట. డిన్నర్ విషయానికి వస్తే నెయ్యితో చేసిన కిచిడీ లేదంటే పులావ్‌ను తీసుకుంటుందట. షూటింగ్ టైంలో మాత్రం ఈ మెనూలో కొంత మేర మార్పులు ఉంటాయట. షూటింగ్ ఉంటే అన్నం, పప్పు.. షూటింగ్ లేకుంటే రోటీ, కూరతో సరిపెట్టుకుంటుందట. వారంలో ఐదు రోజులు తప్పనిసరిగా నెయ్యితో చేసిన కిచిడీ తీసుకుంటుందట. సాయంత్రం 6 గంటల వరకూ డిన్నర్ ఫినిష్ చేస్తుందట. రాత్రి పక్కాగా 9:30కు నిద్ర పోతుందట. అదండీ కరీనా స్లిమ్ సీక్రెట్.. మీరూ పాటించేయండి..