శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ‘తమ్ముడు’ ఇంతలా కీర్తించాడేంటి?

హీరో నితిన్, శ్రీరామ్ వేణు కాంబోలో వస్తున్న చిత్రం ‘తమ్ముడు’? ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న చిత్రమిది. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న ‘తమ్ముడు’ సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ రోజు ‘తమ్ముడు’ సినిమా నుంచి ‘జై బగళాముఖీ..’ లిరికల్ సాంగ్ విడుదలైంది.

‘జై బగళాముఖీ..’ పాటకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యాన్ని అందించగా, అజనీష్ లోకనాథ్ డివైన్ ట్యూన్‌తో కంపోజ్ చేశారు. సింగర్ అబీ వీ ఆకట్టుకునేలా పాడారు. ‘జై బగళాముఖీ, జై శివనాయకీ, జై వనరూపిణీ, జై జయకారిణీ, విద్రుమ రూపిణి, విభ్రమ కారిణి, గగనఛత్ర వింధ్యాచలవాసిని, వీర విహారిణి, క్షుద్ర విదారిణి, సర్వజీవ సంరక్షిణి జననీ…’ అంటూ సాగుతుందీ పాట. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి మహిమను ‘తమ్ముడు’ మూవీలో అయితే ఎంతగానో కీర్తించారు. అమ్మవారి పేర్లన్నీ స్మరిస్తూ ప్రేక్షకుల్లో భక్తి భావన నింపేలా పాట ఉంది. సినిమాలో గ్రామ జాతర వేడుక సందర్భంగా ‘జై బగళాముఖీ..’ పాటను చిత్రీకరించారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *