మెగాస్టార్ చిరంజీవి ఏదైనా ఈవెంట్లో ఉన్నారంటే సందడే సందడి. ఆయన ఆకట్టుకునేలా మాట్లాడుతూ ఉంటారు. సరదాగా మాట్లాడుతూ.. అందరిలోనూ జోష్ నింపుతారు. తాజాగా ‘కుబేర’ సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చిరు.. మరోసారి తన స్పీచ్‌తో అదరగొట్టారు. తాను కూడా ఇకపై ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమని.. అలాగనిస్క్రిప్ట్ పట్టుకుని వచ్చేయవద్దంటూ ఫన్సీగా మాట్లాడారు.
‘‘నాగార్జున ఎన్నో విషయాల్లో నాకు స్ఫూర్తి. ఆయనలో నాకు ఆరోగ్యంపై తీసుకునే శ్రద్ధ, నడవడిక, ఆలోచనలు, స్థితప్రజ్ఞత.. ఇలా ఎన్నో విషయాలు నచ్చుతాయి. నేను కూడా భవిష్యత్తులో అవసరమొస్తే ఓటీటీలో సినిమాలు చేయాల్సి వచ్చినా సిద్ధం. దానికోసం ఇప్పటి నుంచే మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఈ విషయంలోనూ నాగార్జున తీసుకున్న నిర్ణయం నాకు స్ఫూర్తి. ఓటీటీకి ఓకే అన్నాను కదా అని రేపు ఉదయాన్నే స్క్రిప్ట్‌లు తీసుకొని వచ్చేయకండి’’ అంటూ చిరు సరదాగా చెప్పారు. చిరు మాటలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఓటీటీలో ఇకపై చిరును కూడా చూడొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.