నాగవంశీ ఒకే ఒక్క ట్వీట్‌తో హాట్ టాపిక్‌గా ఎన్టీఆర్

ప్రముఖ నిర్మాత నాగదేవర సూర్యవంశీ ఒకే ఒక్క ట్వీట్‌తో రచ్చ లేపారు. నెట్టింట ఇప్పుడు ఆయన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. నాగవంశీ.. తెలుగులోనో.. హిందీలోనో.. ఇంగ్లీలోనో ట్వీట్ పెట్టలేదు.. సంస్కృతంలో పెట్టారు. అయినా సరే.. ట్రాన్స్‌లేట్ చేసి మరీ సినీ ప్రియులు ఆయన పెట్టిన ట్వీట్‌పై ఒక క్లారిటీకి వచ్చారు. ఇంతకీ ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఆ పోస్ట్‌తో ఈ సినిమాలో నటించబోయేది ఎన్టీఆర్ అని క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించబోయేది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అని తెలుస్తోంది.

తొలుత అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ సినిమా తీస్తారని అంతా భావించారు. కానీ అల్లు అర్జున్.. అట్లీతో జత కట్టాడు. ఎన్టీఆర్ కూడా ‘వార్ 2’తో పాటు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తున్నాడు. అయినా కూడా త్రివిక్రమ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని టాక్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్.. కార్తికేయ భగవానుడిగా కనిపించనున్నారని నాగవంశీ ట్వీట్ ద్వారా తెలుస్తోంది. అల్లు అర్జున్‌తో ముందుగా ఈ మైథలాజకల్ చిత్రాన్ని ప్లాన్ చేశారని.. కానీ అల్లు అర్జున్ సైడ్ అయిపోయి సీన్‌లోకి ఎన్‌టీఆర్ ఎంటరైనట్టు సమాచారం. ‘అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో నాకు అత్యంత ఇష్టమైన వారొకరు’ అని నాగవంశీ ట్వీట్ చేశారు. మొత్తానికి ఆయన ఒకే ఒక్క ట్వీట్‌తో ఎన్టీఆర్ పేరు మారుమోగుతోంది.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *