మహేశ్-రాజమౌళి కాంబో.. ట్విస్ట్ ఏంటంటే..

మహేశ్‌బాబు, రాజమౌళి కాంబోలో ఏమంటా చిత్రం ప్రారంభమైందో కానీ అప్పటి నుంచి ఊహాగానాలకు ఏమాత్రం కొదువ లేదు. తాజాగా ఒక ఆసక్తికర ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ‘ఎస్ఎస్ఎంబీ 29’ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం మూడో షెడ్యూల్ నిర్వహించుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకూ మనం రరఈ సినిమా గురించి విన్న కథ వేరు.. ఇప్పుడు కొత్తగా ఒక కథ ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమా కథ.. రామాయణంతో ముడిపడి ఉంటుందని సమాచారం. లక్ష్మణుడు మూర్చబోయినప్పుడు ఆంజనేయుడు సంజీవని కోసం సంజీవ పర్వతాన్నే ఎత్తుకొచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం మహేశ్ కూడా సంజీవని కోసం ఈ చిత్రంలో సాహసాలు చేస్తాడట. హాలీవుడ్‌ సిరీస్‌ ‘ఇండియా జోన్స్‌’ తరహాలో ఉంటుందని గతంలో పలు ఇంటర్వ్యూల్లో చిత్ర రచయిత విజయేంద్రప్రసాద్‌ తెలిపారు. కానీ ఇప్పుడు మరో కొత్త కథ వినిపిస్తోంది. హనుమాన్ తరహాలో తన పాత్రను మహేశ్ డిజైన్ చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఆర్. మాధవన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన సెట్స్‌లోకి ఎంటర్ అవుతారని సమాచారం. మొత్తానికి కథ ఏదైనా యాక్షన్ అడ్వంచర్ మాత్రం కామన్ అని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *