నార్నే నితిన్, సంపద జంటగా నటించిన చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. శ్రీ వేదాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. ఈ సినిమా జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రావు రమేష్, నరేష్, రఘు కుంచె, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నరేష్ గారు ఒక డైలాగ్ చెబుతారు. మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే. ఈ కాన్సెప్ట్ తో సినిమాను రూపొందించాం. మా హీరో నార్నే నితిన్ పక్కింటి కుర్రాడిలా మొదలుపెట్టి, యాక్షన్ పరంగా ఆకట్టుకుంటూ అద్భుతంగా పర్‌ఫార్మ్ చేశాడు. హీరోయిన్ సంపద మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. నా సినిమాల్లో ఎక్కువమంది ఆర్టిస్టులు ఉంటారు. కారణం మన కుటుంబాల్లో ఎలా ఎక్కువమంది మనవాళ్లు ఉండేవారే. నా కథల్లోనూ అలాంటి పాత్రలే పలకరిస్తాయి. ఈ సినిమా మిమ్మల్ని నిరాశపర్చదు’’ అన్నారు.
నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. ‘‘ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో బిగ్ హిట్ మూవీని నిర్మించాలని నార్నె నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్‌లో ఈ చిత్రాన్ని రూపొందించాం. మా చిత్ర హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్‌తో వరుస విజయాలు అందుకుంటున్నారు. ఇక శ్రీ శ్రీ శ్రీ రాజావారు విషయానికొస్తే మంచి గ్రామీణ నేపథ్యంలో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో భారీ తారాగణంతోతెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగేశ్న. అలాగే ఎన్టీఆర్ ఎంతో మెచ్చి, ఈ కథను ఎంపిక చేశారు’’ అని తెలిపారు.
ప్రజావాణి చీదిరాల