Rambabu Gosala :
చేతిలో చిన్న చందన బ్రదర్స్ బ్యాగ్..
అరిగిపోయిన చెప్పులు..
యస్ ఆర్ నగర్ టు కృష్ణానగర్ రోజు ఒకే రూట్లో నడక.. లెఫ్ట్‌రైట్ కొట్టటంతో సినిమా ఆఫీసులన్నీ ఎరుకయ్యాయి..
మొత్తానికి మనోడి చేతికి రాయటానికి పాటొచ్చింది…
సినిమా పేరు వియ్యాల వారి కయ్యాలు…
మీడియాలో బాగానే సౌండ్ చేసింది….
సార్ ఆనందానికి అవధులు లేవు..సినిమా రైటరయ్యాడుగా.
రేపట్నుంచి పాటలే పాటలు డబ్బులే డబ్బులు అనుకున్నాడు.
కట్ చేస్తే నాలుగేళ్లు సినిమా పాట రాలేదు సరికదా..
పూర్తి స్థాయి సినిమా మాత్రం కళ్లకు కట్టినట్లు కనిపించింది..
రాసిన ఒక్కపాటకి నాలుగేళ్ల బ్రేక్ దొరికింది..
అయ్యబాబోయ్ ఇదేం ఇండస్ట్రీ రా బాబు..
అనుకుంటూ నోరు కట్టుకుని పాటకోసం ప్రయత్నించాడు…
అప్పుడొచ్చింది అర్జున్‌రెడ్డిలోని బ్రేకప్‌సాంగ్..
పాట రాసిన సినిమా సూపర్ హిట్టయ్యింది..
దెబ్బకి మనోడికి బ్రేకొచ్చింది…కట్ చేస్తే మరో మజిలీ స్టార్ట్..
ఏలూరికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పల్లెటూరు వేల్పుచర్ల కుర్రోడు…
పట్నం సోకు ఎరుగని ఇంజనీరింగ్ చేసిన అమాయకుడు..
ఇండస్ట్రీలో నిల్చోవటానికి చిన్నపాటి యుద్ధమే చేశాడు…
ఆ యుద్ధంలో సపోర్టు చేసిన ఉమేశ్‌లాంటి కో డైరెక్టర్లెందరో.
పవన్‌కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో పాటరాసి..
చివరికి యుద్ధంలో గెలిచిన వీరుడిలా నిలుచున్నాడు…
పాట 40 మిలియన్లు దాటింది..పేరు అంబరాన్ని అంటింది..
ఇంతకి తనెవరో పేరు చెప్పలేదు కదూ..
ఆ కవి పేరు రాంబాబు గోసాల..ఇప్పుడు ఆయన గెలిచినట్లుగా తనకు తానే ఫీలై ఎంతో ఎమోషనల్‌గా ఇంటర్వూలు ఇస్తున్నారు.
పెద్దగా మాట్లాడని రాంబాబు పెద్దపెద్దగా మాట్లాడుతూ పాటలు పాడుతూ ఇది నేను అని తనివితీరా తనగురించి తాను చెప్తున్నారు.
ట్యాగ్‌తెలుగుకి ఇచ్చిన ప్రత్యేక పాడ్‌కాస్ట్‌లో తన అనుభవాలన్నింటిని పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చారు.
వీలైతే మీరు ఈ ఫస్టాఫ్ ఇంటర్వూను ఓ లుక్కేయండి.. ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : కాలేజ్‌మెంటార్ ఫౌండర్ రాజశేఖర్‌కు జన్మదిన శుభాకాంక్షలు…