ఇద్దరు అన్నదమ్ములు ఉన్నత చదువులు చదివి.. కార్పోరేట్ ఉద్యోగాలను వదిలిపెట్టి.. సినిమా రంగంపై ఆసక్తితో తన తల్లికి నచ్చజెప్పి ఆమె పేరు మీదనే రమాదేవి ప్రొడక్షన్స్‌ను ప్రారంభించి సినిమా తీశారు. ఆ ఇద్దరే సాత్విక్, రుత్విక్. ఒకరు దర్శకత్వంతో పాటు ప్రొడ్యూసర్‌గా చేయగా.. మరొకరు హీరోగా ‘వైభవం’ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమే మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రి రిలీజ్ వేడుకలో ముందుగా మాతృమూర్తి రమాదేవిని హీరో రుత్విక్ – డైరెక్టర్ సాత్విక్‌లు సాదరంగా సత్కరించుకున్నారు. అంతేకాదు తమ మాతృమూర్తే ముఖ్య అతిథిగా వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి… చదువులో, ఆటపాటల్లో అన్నిటా ముందుండి, మంచి ఉద్యోగాలు సంపాదించుకుని, నాకు ఎనలేని పుత్రోత్సాహం పంచారు. తమ ప్యాషన్ కోసం ఉద్యోగాలు విడిచిపెట్టి.. ‘వైభవం’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేస్తున్న నా బిడ్డలు… ఈ రంగంలోనూ విజయబావుటా ఎగురవేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు
దర్శకుడు సాత్విక్, హీరో రుత్విక్‌లు మాట్లాడుతూ.. ‘‘తమ మాతృమూర్తి తమ మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కాదని, ‘వైభవం’ చిత్రం తమకు సినిమా రంగంలోనూ మంచి ఆరంభం ఇస్తుంది. ఇంటిల్లిపాదీ కలిసి చూడాల్సిన చిత్రమిది. కుటుంబ విలువలతోపాటు.. మానవతా విలువలు, భావోద్వేగాలు, సునిశిత హాస్యం కలగలిసిన ఈ చిత్రానికి అన్ని వర్గాల వారు పట్టం కడతారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. హీరోయిన్ ఇక్రా మాట్లాడుతూ.. ఈ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇస్తుండడం గర్వంగా ఉందని తెలిపింది. ఈ వేడుకలో ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన కేఎల్ఎన్, అనంత్, సవిందర్ కూడా పాల్గొని.. ‘వైభవం’ చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ప్రజావాణి చీదిరాల