ప్రముఖ మూవీ మేగజైన్ ఫిలింఫేర్ మే నెల కవర్ పేజీ హీరో విజయ్ దేవరకొండ స్టైలిష్ ఫోటోతో అందంగా ముస్తాబైంది. ఫిలింఫేర్ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన రౌడీ హీరో పర్సనల్, కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నాడు. విక్టరీ మార్చ్ టైటిల్‌తో టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా దాకా విజయ్ దేవరకొండ ఒక స్టార్‌గా ఎదిగిన తీరును ఈ ఎడిషన్‌లో అనలైజ్ చేసింది. పెళ్లి, జీవిత భాగస్వామి వంటి విషయాల గురించి ప్రస్తుతమైతే ఆలోచించడమే లేదని తెలిపాడు. తనకు దర్శకుడు పూరీ జగన్నాథ్ అంటే ఎంతో ఇష్టమని.. ఆయనతో సినిమా చేయాలన్న కల ‘లైగర్’తో నెరవేరిందని తెలిపాడు. అయితే తమ కాంబో హిట్ అవలేదనే బాధ ఉందని తెలిపాడు.
నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్‌తో తనకు మంచి అనుబంధం ఉందని.. వారి విజయాలను తానూ సెలబ్రేట్ చేసుకుంటానని విజయ్ తెలిపాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లో నటించానని.. తననొక లక్కీస్టార్‌గా భావిస్తుంటాడని చెప్పాడు. ఇక రష్మిక విషయానికి వస్తే ఆమెతో చాలా చిత్రాల్లో నటించాలని ఉందన్నాడు. ఆమె ఎంతో మంచి వ్యక్తని.. అందమైన నటి చెప్పాడు. అయితే తనకు జీవిత భాగస్వామి గురించి ఆలోచనే లేదని.. కానీ ఏదో ఒకరోజు తప్పక పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. మీ జీవిత భాగస్వామికి కావల్సిన లక్షణాలు రష్మికలో ఉన్నాయా? అని ప్రశ్నించగా.. మంచి మనసు ఉన్న అమ్మాయి ఎవరైనా ఫర్వాలేదని బదులిచ్చాడు. మొత్తానికి విజయ్ దేవరకొండ అయితే చాలా సేఫ్‌గా సమాధానం ఇచ్చాడు.
ప్రజావాణి చీదిరాల