సినిమా అనేది కొందరిని ఉన్నత శిఖరాలకు చేరిస్తే.. మరికొందరిని ఉన్న స్థానం నుంచి పాతాళానికి పడేస్తుంది. కొన్ని సార్లు ఎన్ని సినిమాలు చేసినా మారని ఫేట్ ఒకే ఒక్క సినిమాతో మారిపోతుంది. అలా ఒకే ఒక్క సినిమాతో ఫేట్ మారిపోయిన హీరోయిన్స్‌లో కయ్యదు లోహర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో సరైన అవకాశం కోసం ఏకంగా మూడు నాలుగేళ్ల పాటు వేచి చూసింది. 2021లో ‘ముకిల్ పేట్’ అనే చిత్రంలో నటించింది కానీ ఈ ముద్దుగుమ్మకు పెద్దగా పేరు రాలేదు. ఆ తరువాత మరో మలయాళ చిత్రం.. అది కూడా అమ్మడికి గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఆ తరువాత తెలుగులో ‘అల్లూరి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అది కూడా పెద్దగా ఫలితాన్నివ్వలేదు.
ఆ తరువాత మరాఠి.. ఇతర భాషలు చేసింది కానీ ఏ ఒక్కటీ ఫలితాన్నివ్వలేదు. చివరకు ఈ ముద్దుగుమ్మను ‘డ్రాగన్’ రూపంలో అదృష్టం వరించింది. ఈ సినిమా మంచి హిట్ అవడంతో కయ్యదు లోహర్‌ను వరుస అవకాశాలు వెదుక్కుంటూ వస్తున్నాయి. మరి ఇంతలా దర్శకనిర్మాతలు తన వెంట పడుతుంటే ఊరుకుంటుందా? ‘డ్రాగన్’ చిత్రానికి కేవలం రూ.30 లక్షలు తీసుకున్న ఈ ముద్దుగుమ్మ తన కొత్త సినిమాలకు రెమ్యూనరేషన్ పెంచేసిందట. ప్రస్తుతం రూ.2 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తోందట. దీనికి కారణం తమిళ్ స్టార్ హీరోలు శింబు, ధనుష్ వంటి వారు ఈ ముద్దుగుమ్మను హీరోయిన్‌గా ఎంచుకోవడమేనని అంటున్నారు.
ప్రజావాణి చీదిరాల