Ram Pothineni Skanda movie first review:
నటీనటులు : రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్, ప్రిన్స్ సిసిల్, పృధ్వీ, దగ్గుబాటి రాజా. గౌతమి, ఇంద్రజ, రజిత, ‘బాహుబలి’ ప్రభాకర్, రచ్చ రవి తదితరులు..
మాటలు : యం.రత్నం
ఎడిటింగ్ : తమ్మిరాజు.
సంగీతం : యస్.యస్ తమన్
కెమెరా : సంతోష్ గెటాకే
నిర్మాతలు : చిట్టూరి శ్రీనివాస్, జీ స్టూడియోస్
కథ– స్క్రీన్‌ప్లే–దర్శకత్వం : బోయపాటి శ్రీను
సినిమా కథ :
సినిమా స్టార్టవ్వగానే రుద్రకంటి రఘు రామ రాజు ( ఆర్‌ఆర్‌ఆర్) (శ్రీకాంత్) క్రౌన్ కంపెనీ అధినేతకు ఉరిశిక్ష పడుతుంది. అతని కంపెనీలో పనిచేసే
పదిమంది అమ్మాయిలు చనిపోవటంతో ఆ నేరాన్ని తనే చేశాడని కోర్టు నమ్మి మరణశిక్ష విధిస్తుంది. కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుమార్తె
ఎంగేజ్‌మెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ రాష్ట్రానికి సంబంధించిన అనేకమంది మంత్రులతో పాటు గవర్నర్ కూడా ఆ వేడుకకి హాజరవుతుంది.
ఎంగేజ్‌మెంట్‌కి వచ్చిన తెలంగాణా సీయం కుమారుడు పెళ్లికూతురుని తీసుకుని హెలికాప్టర్‌లో వెళ్లిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న సీయం
అందరిముందు పరువు పోతుందనే భయంతో తన సొంత మామను చంపి, గుండెపోటుతో తన మామ చనిపోయాడని ఎంగేజ్‌మెంట్‌కి వచ్చిన
వారందరిని నమ్మిస్తాడు. చావు ఇంట్లో శుభకార్యం జరగకూడదు కాబట్టి ఎంగేజ్‌మెంట్ ఆగిపోయింది అని అందరిని వెళ్లిపొమ్మంటాడు. ఆ క్షణం
నుండి అక్కడితో రెండు రాష్ట్రాల సీయంలకు యుద్ధం మొదలవుతుంది. ఒకరిపై ఒకరు యుద్ధానికి సిద్ధపడతారు. నా రాష్ట్రాంలోకి ఎలా అడుగు
పెడతావో చూస్తాను అని తెలంగాణా సీయం అంటే నీ ఇంటికి వచ్చి నా కూతురిని నాతో పాటు తీసుకెళ్లి పరువు కాపాడుకుంటాను అంటాడు ఆంధ్ర
సీయం. ఇది అసలు ‘స్కంద’ కథకు బీజం. సినిమాలో ఈ పార్టంతా కేవలం 15 నిమిషాలు మాత్రమే. ఇలా జరుగుతున్న టైమ్‌లో హీరో రామ్ ఎంట్రీ
ఇస్తాడు. రామ్‌కి సీయంలకి మధ్య గొడవేంటి? శ్రీకాంత్‌కి ఎందుకు ఉరిశిక్ష పడుతుంది? శ్రీలీల కేరక్టర్ ఏంటి? సినిమాలో సాయి మంజ్రేకర్ రామ్‌కి ఓ
సర్‌ప్రైజ్ ఉంది అంటుంది? ఆ సర్‌ప్రైజ్ ఏంటి? ఇవన్నీ సిల్వర్‌స్క్రీన్ మీద చూడాల్సిందే.
ఎలాతీశారు :
కొంతమంది దర్శకుల సినిమాలకు వెళ్లేటప్పుడే కొన్ని ఫిక్సై సినిమాలకు వెళతాడు సగటు సినిమా ప్రేక్షకుడు. అలాగే బోయపటి శ్రీను దర్శకత్వంలో సినిమాకి వెళ్లే ప్రేక్షకుడు కూడా ఆ సినిమా మంచి మెసేజ్‌తో కూడిన ప్రేమ సందేశాలు ఉంటాయి అనుకోవటం తప్పు. బోయపాటి సినిమాకి వెళ్లేటప్పుడు మంచి మాస్ సినిమాకి వెళుతున్నాం. అందులో లాజిక్‌లు వెతక్కూడదు, సినిమా మ్యాజిక్‌ను మాత్రమే ఎంజాయ్ చేయాలి అని ఫిక్స్ అవ్వాలి. అలా వెళ్లే ప్రేక్షకునికి మాత్రం ఫుల్ ఎంజాయ్‌మెంట్ ఖాయం. లేదంటే ఒకరి మొఖాలు ఒకరు చూసుకోవటం ఖాయం. ‘స్కంద’ సినిమా విషయానికి వస్తే మాత్రం రామ్ పోతినేని తన స్టామినాని మరోసారి ప్రేక్షకులకి రుచి చూపించాడు. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ , కలర్‌ఫుల్ సెట్టింగ్‌లతో పాటు ప్రతి ఫ్రేమ్‌లో వందలకొద్ది ఆర్టిస్ట్‌లు దర్శనమిచ్చారు. రకరకాలైన డిజైనర్ కత్తులు కావాలంటే మాత్రం బోయపాటి సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో డిఫరెంట్ యాక్షన్ సీన్స్‌ని ప్రేక్షకులకి పరిచయం చేశారు యాక్షన్ డైరెక్టర్ స్టంట్ శివ.
సినిమా బలాలు :
– హీరో రామ్ నటన
– బోయపాటి దర్శకత్వ ప్రతిభ
– సినిమా అంతా గ్రాండియర్‌గా ఉండటం
– కెమెరా పనితనం
బలహీనతలు :
– సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోకపోవటం
– సినిమా నిడివి ఎక్కువగా ఉండటం
బాటమ్‌లైన్ :
రామ్ ఎనర్జీ విత్ బోయపాటి బాలయ్యలా ఉంది…
కెవ్వుకేక.కామ్ రేటింగ్ : 3/5
శివమల్లాల
Also Read:IPS Kothakota Srinivasa Reddy:ఎంతోమంది వస్తారు.. కానీ ఈయన?